వల్లభాయిపటేల్
99
ఒకనాఁడాయన యేదో యొక కోర్టులో నేదోయొక కేసులో వాదించుచున్నాఁడు. అప్పు డాయన సతీమణి పరమ పదించినట్టు వార్త చేరినది. ఒక్క త్రుటిపాటు - ఒకేత్రుటిపాటాయన మ్లానవదనుఁ డైనాఁడు. ఆవెనువెంటనే తా నా యతి ఘోరదుర్వార్తను విననట్టే తనవాదనను దిరిగి కొనసాగించినాఁడు. ఆ కేసులో గెలిచినాఁడుకూడ.
మరొకసారి యాయన శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చినది. "బాధతోఁగూడిన యాపరేషన్‌గనుక క్లోరోఫారము పుచ్చుకొనుఁడని డాక్ట రెంతోదూరము చెప్పిచూచినాఁడు. కాని యందుకు సర్దా రియ్యకొననే లేదు.
కె. యఫ్. నారిమ ననిన నాయన కెంతో ప్రేమ. నారిమన్‌కూడ నాయనపట్ల నెంతో భక్తిప్రేమలను బ్రదర్శించువాఁడు. "సర్దార్"అను బిరుదు కాయన తగినవాఁడని దానితో నాయనను బ్రప్రథమముగా సంబోధించినవాఁడుకూడ నారిమనే. అయినను నారిమన్‌పట్లఁ గాఠిన్యము వహించుట తన ధర్మమని తోచినప్పు డందు కాయన లవశేషముగానైన సంకోచించలేదు!
ఇట్టి వ్యక్తినిగాకపోయిన మరెవరిని మనము స్థితప్రజ్ఞుఁడని పేర్కొనఁగలము?
స్వధర్మనిర్వహణలో నిర్భీకత్వమును, నిశ్చలత్వమును బ్రదర్శించు కర్మవీరుఁడు గనుకనే సర్దార్‌పటేల్ పైకిఁ గర్కశుని