పుట:2015.328620.Musalamma-Maranam.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముసలమ్మ మరణము

19

వెట్టూ? యేఁట నొసంగు పొంగళుల నీ వేలాగునన్‌ మ్రింగితీ?
వెట్టూ నేఁటికి నెత్తిఱాయి వయితీ? వేమందుమో దైవమా! 80

వ. అని తమ కోడలి నుద్దేశించి. 81

గీ. చీకు ముసలి వారి చెయి విడనాడ నీ
కెట్లు మనసు వచ్చె? నేమి చెప్ప
భక్తి మాకు నింకఁ బరిచర్య సేయు వా
రెవరు? చెప్పు మాకు నేది గతియొ? 82

గీ. కనులు లేని మాకుఁ గన్నును నూఁతకో
లయును నీవ మా తనయులకంటెఁ
గూర్తు మాకు ముద్దుకోడలా! నీవు లే
నట్టి యిల్లునిల్లె? యడవి గాక. 83

వ. అనుచు. 84

చ. వెడవెడబాష్పముల్‌ గురియు వృద్ధజనంబులఁ గాంచి యెల్లరుం
గడుపున గంపెఁ డగ్నిపడి గాసి యొనర్చినభంగి నేడ్వఁగాఁ
దడఁబడ మానసంబు వనితామణిదైవమ యేమి చేయుదున్‌
గడుఁబసినాఁటఁగోలె ననుఁ గాచిన వీరిని నెట్లు వీడుదున్‌. 85

క. పుట్టియుఁ బుట్టక మున్నే
కట్టిఁడి గతి జనని జనకుఁ గ్రమమున దైవం
బట్టే మ్రింగినఁ దమ సుత
నట్టుల ననుఁ బెంచిరి గద యగునే విడువన్‌. 86

గీ. అయిన నాచేయు కార్య మీ యఖిలమైన
వారికిని, వీరికిని, శుభం బారఁజేయు