పుట:2015.328620.Musalamma-Maranam.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
20
ముసలమ్మ మరణము

వీరికై విడువక మేను పెంచి పెంచి
యేమి చేయంగఁ బ్రొయిలోన నిడనెయంచు. 87

వ. తలపోసి, తిన్నని యెలుంగేర్పడ నయ్యిందువదన యిట్లని విన్నవించె. 88

గీ. కొడుకులెల్లరు రాములు, పుడమి తనయ
లెల్ల కోడండ్రుఁ, దక్కువ యేమి మీకు?
ఱెప్ప లక్షులఁబోలె మిమ్మెప్పగిదిని
అహరహమ్మును సేవింతు; రడల నేల? 89

వ. అని వెండియు. 90

ఉ. తల్లియుఁ దండ్రియున్‌ గురువు దైవము లెల్లరు మీర; మీరలే
చెల్లఁగనియ్యరేని యిఁకఁ జెల్లునెనాదగు పూన్కి యెచ్చటన్‌?
గల్లయొ సత్యమో యెఱుఁగ; గణ్యతఁదత్త్వముఁ దెల్పువేళమే
నెల్లఁ బరోపకారమునకే యనిపల్కితి; రట్లు చేసెదన్‌. 91

సీ. అనవిని మామ యిట్లను నమ్మ నిను దూఱ
                 నెంచిన వాఁడఁ గా నేను వినుము
నీ వెఱుంగని దేది నే నెఱుంగుదునమ్మ
                 నీ యిచ్చ వచ్చినట్లే యొనర్పు
మనుచు దుఃఖమ్మున నాననమ్మును వాంచి
                 యొండు వలను చూచుచుండెనంత
నత్తగా రడలుచు నల్లన ముద్దిడి
                పోయిరమ్మని పల్కఁబువ్వుఁబోణి

తే. హృదయమున నగ్గలంబగు ప్రీతి మెఱయఁ
దనదు చిన్నారి పొన్నారి తనయుఁ దేరఁ