పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
[5]
33
విశ్వనాథనాయకుఁడు

పాండ్యునితో 'ఇదిగో వ్రేటువేయుచున్నాను త్రప్పించుకో'యని పలికి యొక్కవ్రేటు వేసెనఁట! ఆ వ్రేటుతోఁ బాండ్యుని దేహము రెండుతుండములై క్రిందఁ బడెనఁట!

ఈ విధముగాఁ 'గర్ణాటపాలకులచరిత్ర'మను స్థానిక చరిత్రమునందుఁ దెలుపఁబడినది గాని యియ్యది సత్యమని విశ్వసింపరాదు. ఇయ్యది విశ్వనాథనాయఁడు భీమబలుఁడని తెలుపుటకై యీ కథ కల్పింపఁబడి యుండవచ్చును. దీని వాస్తవ మెట్టిదైనను నీపాండ్యులలో మొదటివాఁడయిన పరాక్రమపాండ్య దేవపెరుమాళ్ళ మరణానంతరము తెంగాశి పాండ్యులు విశ్వనాథనాయనివారితో సంధి గావించికొని యాతని సామంతులై కప్పము చెల్లించువారుగ నుండిరనుట సత్యము. వీనితమ్ముఁడు తిరునల్వేలి కులశేఖర పెరుమాళ్లను నతఁడు 1553 లో తెంగాశిలో బట్టాభిషిక్తుఁ డయ్యెను. వీనికి 'వీరవేలు' అను బిరుదుమాత్రమె వహించెను. వీనికుమారుఁడు 'అతివీరరామపాండ్య అలగన్‌' అను నాతఁడు 1564 లో పట్టాభిషిక్తుడై 'శివలవేలు' అను బిరుదమును బొందెను. వీరి కెవ్వరికిని పరాక్రమ పాండ్యదేవ పెరుమాళ్ళకు వలె నప్రతి హతభువనైక వీరుఁడనియు, ద్రిభువనాధిపుఁడనియుఁ, జంద్ర కులావతంసుఁ డనియు మొదలగు బిరుదములు స్వాతంత్ర్యమును దెలుపునవి యేవియు లేవు గావున విశ్వనాథనాయని వారి బ్రతిఘటించి యుద్ధముచేసి మరణించినవాఁడు పరాక్రమ