పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

విశ్వనాథనాయకుఁడు

పడుదురా! అట్లయినపక్షమున మీకోరికప్రకారము నడువంగలవార' మని ప్రత్యుత్తరము వ్రాసి విశ్వనాథనాయనివారికిఁ బంపిరఁట. విశ్వనాథనాయనివారి పౌరుషపరాక్రమములుపాండ్య వీరులైదుగురు దలపడినను వెనుదీయ నట్టివికావు. కనుక మరల యతఁడు 'మీరైదుగురు నైదుసీమలకు ప్రభువులుగ నున్నారు. నే నొక్కఁడనైయుండియు మిమ్ములను జయించి మీసీమల నొడిచికొనవలయు నని వచ్చియున్నాను. కనుక మీర లైదుగురును గలిసి నాయొక్కనితోనే పోరాడుట న్యాయము.

వా రంగీకరింపక తమలో బాహుబలపరాక్రమ వంతుడైనవాని నేరుకొని యంగరక్షకై కవచమును దొడిగి యశ్వారూఢుని గావించి వాని కొక ఖడ్గము నొసంగి యుద్ధముచేయుటకై నిర్ణీతరంగస్థలమునకుఁ గొనివచ్చిరఁట!

ఈద్వంద్వయుద్ధము ముగియుట కెంతోకాలము పట్టలేదు. విశ్వనాథుఁడు తుదకంగీకరించి తానును యుద్ధసన్నద్ధుఁడై రంగస్థలమున కుఱికి 'మొట్టమొదట నీవే కొట్టుమని పాండ్యవీరుని నాహ్వానించెనట! ఆతఁ డట్లే యొక్కవ్రేటువేసెను. విశ్వనాథుఁడు తనఖడ్గముతో నావ్రేటు తప్పించుకొనియెనట. అంత పాండ్యుఁడు విశ్వనాథనాయని వ్రేటువేయమని పలికెనఁట! అతఁడు నిరాకారించి పాండ్యునే వ్రేటు వేయమని ముమ్మాఱు పలికెనట! పాండ్యుఁ డట్లుగావించెనఁట! అంత విశ్వనాథనాయఁ డెప్పటియట్ల తప్పించుకొని