పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
21
విశ్వనాథనాయకుఁడు

ణలేక వ్యధలం బడియుండుటయుఁ గన్నులారఁ గాంచి మిక్కిలి విచారించెను. వీని నన్నిటిని జక్కపఱచి రాజ్యమును సౌభాగ్యస్థితికిఁ గొనివచ్చుటకు రాణువలోనిబొక్కసము చాలదని తలపోసి తనతండ్రి యొసంగిన ద్రవ్యమునంతయు నాతనియిష్టాను సారముగా వ్రయపఱచి సఫలీకృతమనోరథుఁ డగుటకు సంకల్పించి మిక్కిలి సమర్థుఁడయిన 'అరియనాధ మొదలారిని ముఖ్యమంత్రిగను, దళవాయిగ నేర్పఱచి కార్యసాధనకుఁ గడంగెను. ఇతఁడు విజయనగరసామ్రాజ్యపక్షమునఁ బ్రతినిధి పాలకుఁడుగ మాత్రమె నియమింపఁబడినవాఁడు గనుక చోళపాండ్యరాజ్యముల రెంటిని పాండ్యరాజ్యము పేరిటనే స్వతంత్రుఁడై పరిపాలనముచేసినను విజయనగరసామ్రాజ్యమునకు లోఁబడియె పరిపాలనము చేసినని మనము గ్రహింపవలయును. విశ్వనాథనాయఁడు రాజ్యపరిపాలనకు వచ్చినకొలదికాలమునకే చంద్రశేఖరపాండ్యుఁడు మృతిఁబొందెను. విశ్వనాథనాయని వారియాజ్ఞను శిరసావహించి దళవాయి అరియనాథ మొదలారియు, దళవాయి బిసపాకము కేశవప్పనాయఁడు ననువా రిరువురును చుట్టునుబురుజులు గలిగి యష్టద్వారములతో నొప్పెడు మధురాపురదుర్గమును బునర్నిర్మాణముఁ గావించుటయెగాక మీనాక్షిసుందరేశ్వరుల కోవిలలను సొగసుగా గట్టించిరి. మధురాపురమునంతయుఁ గలకలలాడుస్థితికిఁ దీసికొనివచ్చిరి. ఇట్టికాలమునఁ గృష్ణదేవరాయలవారు 1530 వ సంవత్సరమున విజయనగరములో స్వర్గస్థుడుకాఁగా నాయని