పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20
విశ్వనాథనాయకుఁడు

పట్టితెచ్చి యెదుటఁబెట్టి మా యుత్తరువు శిరసావహింతునని పలికినావు. ఇంతమేలుగావించిన నిన్ను మఱచుట మాకు శ్రేయస్సుగాదు. దైవమును దోడ్పడఁదు. పూర్వము మాఁకుపకారముచేసి మాదయను సంపాదించుకొన్నప్పుడు కొంత దేశమునకు ని న్నొక పాలకునిగా నియమింతు మని వాగ్దత్తముకూడ చేసియున్నాము. మఱియు నీపాండ్యరాజ్యము నీపరముగానుండి శాంతముగానుండినఁగాని నగరికి 'తోఫారూకలు' కూడా రావు. ఇంక నీవు పాండ్యరాజ్యమునకుఁ బోయి దేశమును 'బందోబస్తు'లో నుంచినఁగాని యనుకూలపరిస్థితు లేర్పడఁజాలవు. నీవుతత్క్షణమపోయి పాండ్య రాజ్యమున కాధిపత్యము వహించి యారాజ్యము నభివృద్ధికిఁ దీసికొనివచ్చుటయెగాక మాసామ్రాజ్యముపట్టున నిదివఱలోవలెనె భక్తివిశ్వాసములు చూపుచు యశస్సు నార్జించుటయె నీకు మేము చేసెడి యుత్తరు"వని చెప్పి యొప్పించెను. అంతట విశ్వనాథనాయనివారు దుర్గామహాదేవిని వెంటఁగొని దక్షిణమధురాపురమునకు వెడలునపుడు కృష్ణదేవరాయలవారు వానికి బహు సైన్యముల నొసంగి సాగనంపెను. అట్లు విశ్వనాథనాయనివారు క్షేమముతో మధురాపురముఁ జేరినవెనుక దేశమంతయుఁ బాడువడి యుండుటయు, కోటలు కొమ్మలు శిధిలావస్థయం దుండుటయు, దేవళములు సంరక్షణములేక వికలస్థితిఁజెంది యుండుటయు, రాజ్యమంతయు నడవులతో నల్లుకొనిపోయి దొంగల కాకరమైయుండుటయు, ప్రజలు మానప్రాణధనరక్ష