పుట:1857 ముస్లింలు.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857 :ముస్లింలు


తిరుగుబాటులో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ప్రముఖ యుదాయాధుడుగా ఖ్యాతిగాంచిన కాలేఖాన్‌ ఆంగ్లేయ సైన్యాల పాలిట మృత్యుదేవతయ్యారు. బహదాూర్‌ షా జఫర్‌ ప్రత్యేక సూచన మేరకు ఆంగ్లేయులతో పోరు సల్పేందాుకు సైన్యాన్ని తయారు చేయటంలో ఆయన నిమగ్నమయ్యారు. ప్రజలను, స్వదేశీ సైనికులను తిరుగుబాటుకు ప్రేరేపించి స్వదేశీ సెనిక దళాలను ఏర్పాటు చేయటంలో శ్రద్ధ చూపారు. స్వయంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ సైన్యాల మీదా పోరుసల్పారు.

తిరగబడ్డ ప్రభుత్వాధికారులు

ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రభుత్వాలో ఉన్నతాధికారులుగా బాధ్యాతలు నిర్వహిస్తూ ఉండి 1857లో ప్రజల అభీషం మేరకు తిరుగుబాటుకు నాయకత్వా వహించిన యోధులు కూడ పలువురు ఉన్నారు. అటువిం వారిలో సర్దార్‌ హిక్మతుల్లా ఖాన్‌, మున్షీ జకీయుద్దీన్‌ అహమ్మద్‌ చెప్పుకోదగ్గవారు. ప్రముఖ ప్రభుత్వ న్యాయవాది అయిన మున్షీ జకీయుద్దీన్‌ బీహార్‌ రాష్ట్రానికి చెందిన జాంగాౌవ్‌ (Jamgaon) నివాసి. జాగాౌంవ్‌ కేంద్రాంగా మున్షీ అహమ్మద్‌ ప్రజల, ప్రధానంగా యువకుల, అండదాండలతో తన ప్రాంతంలోని స్వదేశీ సంస్థానాధీశులతో సంప్రదింపులు జరిపి కంపెనీ పాలకుల మీద తిరుగుబాటుకు భారీ సన్నాహాలు చేశారు. ఈ రహాస్య సన్నాహాల సమాచారం ఒక ద్రోహి కారణంగా ముందుగానే ఆంగ్లేయాధికారులకు చేరటంతో మున్షీ అహమ్మద్‌ ప్రయత్వాలు ఫలించలేదు .

మున్షీ జకీయుద్దీన్‌ అహమ్మద్‌ ప్రయత్వాలనూ, ఆయన దూరదృష్టినీ ఉటంకిస్తూ తిరుగుబాటు విఫలం కాకున్నట్టయితే తలత్తే భయంకర పరిణామాలను కూడ ప్రస్తావిస్తూఆంగ్లేయుల పత్రికలు, అధికారుల రికార్డులు భయాందోళనలను వ్యక్తం చేశాయంటే మున్షీ అహమ్మద్‌ ఎంత పటిష్టంగా తన పథాకాన్ని రూపొందించారో ఊహించవచ్చు. ఈ విషయాన్ని కలకత్తాకు చెందిన English Man అను పత్రిక 1857 లై 17నాటి సంచికలో ఓ ఆంగ్లేయాధికారి మాటలను ఉటంకిస్తూ ఒకవేళ వృద్ధ వకీల్‌ను కనుక తన పథకం ప్రకారంగా ముందుకు సాగనిచ్చిఉన్నట్టయితే అతను ఈ ప్రాంతంలో భయోత్పాతం సృష్టించి ఉండే వాడనటం లో ఏ మాత్రం సందేహంలేదు అని పేర్కొనడాన్ని బట్టి మున్షీ ప్రయత్వాల తీవ్రత వెల్లడవుతుంది.

ప్రభుత్వ పదవిలో కొనసాగుతూ రహస్యంగా పోరాటానికి కొందరు సిద్ధపడగా మరి కొందరు పదవులను తృణప్రాయంగా త్యజించి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా

54