పుట:1857 ముస్లింలు.pdf/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంగ్లేయుల రాక్షసత్వం

ప్రకటనలలో ఉన్న వాస్తవమెంతో బహిర్గతం చేసేవిధంగా ఆనాడు ఫెడ్రరిక్స్‌ ఎగెంల్స్‌ చేసిన వ్యాఖ్యానం ఈ విధంగా ఉంది:

నాగరికత చెంది ఔదార్య సాహసాది సుగుణాలను కల్గి సాధుస్వభావులైన ఈ బ్రిటిష్‌ సైనికుల మహామ్మారి వాతకంటె, మిడతల దండులాగు పట్నాల మీదపడి దారిలో కనబడిన దానిదల్లా తుడిచిపెట్టేసిన చెంగిజ్‌ ఖాన్‌, తైమూర్ల కాల్మీక్‌ మూకలే వెయ్యిరెట్లు క్షేమకరమని ఏ దేశానికైనా అనిపించి ఉంటుంది. చెంగీజ్‌ ఖాన్‌, తైమూర్ల దండులు తాత్కాలికంగా దేశం మీద పడి దోచుకుని, మరో దేశం మీద పడడానికి వాటి మానాన అవి ఎటు పడతే అటు పోయేవి; కాని అన్ని విషయాలనూ ఒక క్రమపదతిలో యధావిధిగా

1857 ముస్లింలు.pdf

ప్రజలను దారుణ మారణకాండకు గురిచేస్తున్న ఆంగ్ల సైన్యాలు

జరిపించడమనేది ఒక స్వాభావిక గుణంగా కలిగిన ఇంగ్లీసు వారు మాత్రం లూటీని ఒక విశిష్ట విధానం కింద రూపొందించి, లూటీచేయబడిన చోరీ అస్తులను అందుకొని వెల యేర్పర్చే ఏజెంట్లను తమసైన్యాలతో కూడా తీసుకొచ్చి, వీరి చేత లూటీ వస్తువును ప్రతి దానినీ చిట్టా పుస్తకాలలో నమోదు చేయించి, లూటీవస్తువులను వేలం వేయించి, బ్రిటిష్‌ సామ్రాజ్య పరాక్రమాలకు మొత్తంగా ముట్టవలసిన పారితోషికంలో ఎట్టి మోసమూ జరగకుండా ధర్మంగానూ న్యాయంగానూ అణాపైసాలతో సహా ముట్టేటట్టు వెయ్యి కళ్ళ తో కనిపెడుతున్నారు. (ప్రదమ భారత స్వాతంత్య్ర సంగ్రామం 1857-1859, కారల్‌ మార్క్స్‌,

223