1857: ముస్లింలు
మాతృ దేశాన్ని కీర్తిస్తూ, బానిస బంధనాల నుండి విముక్తి కోసం పోరుబాట నడవమంటూ ప్రబోధ గీతమొకటి 'పయామే ఆజాది' లో ప్రచురితమైంది. ఈ గీతం హిందూ-ముస్లిం- సిక్కులు అంతా ప్రియ మెన సోదరు లుగా వర్ణించింది. మౌల్వీ లియాఖత్ అలీ రాసిన ఆ గీతంలో హిందూ-ముస్లింల ఐక్యతకు సంబంధించిన ప్రస్తావన ఇలా సాగింది: '........................... తోడో గులామీకే జంజీరౌే, బర్‌సావో అంగారా ! హిందూ, ముసల్మాన్, సిఖ్ హమారా భాయీ భాయీ ప్యారా యే హై ఆజాదికా ఝుండా, ఇసే సలామ్ హమారా ! '. (బానిస సంకెలు తెంపండి నిప్పులవానై కురండి హిందూ ముస్లిం సిక్కులందరం ప్రియాతి ప్రియమౌ సోదరులం ఇదిగిదిగో మన స్వతంత్ర జెండా చేస్తాం సలాము గుండెల నిండా ! తెలుగు అనువాదం దివికుమార్)
ఈ ప్రయ త్నాలలో భాగంగా బ్రిటిషర్ల అధికారాన్నిఅంతం చేయాలంటే హిందూ -ముస్లింల ఐక్యత అత్యవసరమని అజీముల్లా వివరించారు. మతం విధించే పరిమితులకు, ఆచార సంప్రదాయాల ఆంక్షలకు అతీతంగా హిందూ-ముస్లిం ఐక్యత సాధించేందుకు అవిశ్రాంతంగా ఆయన శ్రమించారు. ఉమ్మడి శత్రువు మీద ఐక్యపోరాటాల అవసరాన్ని గుర్తించిన అజీముల్లా మతాలకు సంబంధించిన ఆచార సాంప్రదాయాల ఆటంకాలను ప్రజల మధ్యకు రానియ్యరాదాని భావించారు.
ప్రముఖ పాత్రికేయుడు William Howard Russel ను కలసిన అజీముల్లా నమాట్లాడుతూ I am not such a fool as to believe in these foolish things. I am of no religion.. ' అని మతం పట్ల, మతాచారాల పట్ల తనకున్న అభిప్రాయాన్ని చాలా
178