పుట:1857 ముస్లింలు.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ-ముస్లింల ఐక్యత


స్పష్టంగా ప్రకటించారు. (Eighteen Fifty Seven,Surenda Nath Sen,Govt. of India Publications, 1957, P. 126).

1857నాటి పోరాటంలో ఆద్బుతమైన పాత్ర వహించిన కాన్పూరు అధినేత నానా సాహెబ్‌ ఇండియాలోని హిందూ-ముస్లింల రాజ్యాలను పున:స్థాపంచేందుకు, మన దేశాన్ని ఆంగ్లేయుల నుండి రక్షించుకునేందుకు భగవంతునిచే ఆజ్ఞాపించబడ్డాను అని ప్రకటించారు.

ప్రజలలో మతాలకు అతీతంగా ఐక్యతను కోరుకున్నఈ యోధుల ప్రయ త్నాలు, ఆ ప్రయత్నాల ప్రభావం, నాయకుల దూరదాష్టి కారణంగా నానా సాహెబ్‌ హిందూ- ముస్లింల ఐక్యతను మరింతగా పటిష్టం చేసేందుకు ప్రయత్నించారు. ఆయన తన గురువుకు రాసిన ఓ లేఖలో కాబుల్‌లోని పఠానులు, మలేక్‌లు మన బంధువులు, మిత్రులు.ముస్లింల పట్ల సమదృష్టితో వ్యవహరించాలి...వాళ్ళు మన సోదరులే. మనమందరం ఐకమత్యంతో ఉన్నప్పుడే మన లక్ష్యం సిద్ధిస్తుంది అని స్పష్టం చేశారు. (జ్ఞాపకం చేసుకోండి ఎప్పుడైనా...అమర వీరుల ఉత్తరాలు, అనువాదం: జె.లక్ష్మిరెడ్డి, భారత ప్రభుత్వ ప్రచురణలు, న్యూఢిల్లీ, 1998, పేజి.10)

ప్రముఖుల ఐక్య పోరాటాలు

ఉమ్మడి శత్రువు మీద స్వదేశీ పాలకులు సమరశంఖారావం పూరించి పోరాడుతుండగా, ఇండియాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రముఖులు కూడ ఐక్యంగా మాతృభూమి విముక్తి కోసం కంపెనీ సైన్యాలను ఎదుర్కొన్నారు. ఈ పోరాటంలో ఆయా ప్రాంతాలకు చెందిన హిందూ-ముస్లిం ప్రముఖులు ఏకమై ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తమ సర్వసంపదలను, చివరికి తమ ప్రాణాలను కూడా, పణంగా పెట్టి పోరుబాటన ముందుకు సాగారు.

ప్రస్తుత హర్యానా రాష్ట్రంలోని హంసి పట్టణానికి చెందిన హకీంచంద్‌ జైన్‌ విద్యాధికులు. బహుభాషా పండితులు, న్యాయశాస్త్ర కోవిదులు మాత్రమే కాకుండా ఆ ప్రాంతంలో పేరెన్నికగన్న ప్రముఖుడు. మీర్‌ నుండి ఢిల్లీ చేరిన స్వాతంత్య్ర సమరయాధులు డిల్లీని ఆంగ్లేయుల నుండి చేజిక్కించుకున్నారన్న వార్త వినగానే బహదూర్‌ షా జఫర్‌ దార్బారుకు ఆయన తరలి వెళ్ళారు. అక్కడ తాంతియా తోపే తదితర యోధులతో


179