పుట:1857 ముస్లింలు.pdf/144

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంధ్ర ప్రదేశ్‌ ముస్లింలు


కుట్ర పన్నారన్న ఆరోపణ మీద రాజద్రోహం నేరం మోపి ఆయనకు జీవిత ఖైదు విధించారు. ఈ పోరులో ఆయనకు సహకరించిన అనుచరులకు 10 సంవత్సరాలకు పైబడిన జైలు శిక్షలు పడ్డాయి. చిట్టచివరకు ముబారిజుద్దౌలా జైలుశిక్షను అనుభవిస్తూ గోల్కొండ కోటలో 1854 జూన్‌ 25న కన్నుమూశారు.

బ్రిటిషు వ్యతిరేక ఉద్యమంలో కర్నూలు నవాబు గులాం రసూల్‌ ఖాన్‌, ముబారిజుద్దౌలాతో చేతులు కలిపారు. ఈ విషయాన్ని పసికకట్టిన బ్రిటిష్‌ అధికారులు టి.యల్‌.బ్లేన్‌ అను సైనికాధికారిని విచారణ కోసం నియమించారు. ఆ విచారణ తరు వాత 1839 అక్టోబర్‌ 18న ఆంగ్ల సైన్యాధికారి ఎ.బి.డైస్‌ నాయకత్వంలో ఆంగ్ల సైన్యం కర్నూలు నవాబు సంస్థానం మీద దాడి చేసింది.

ఆ పోరాటంలో నవాబు గులాం రసూల్‌ ఆంగ్ల సైన్యాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నప్పటికీ పరాజితులయ్యారు. ఆయనను అరెస్టు చేసి తిరుచునాపల్లి ఖైదుకు తరలించారు. ఆ జైలులోనే గులాం రసూల్‌ తన సేవకుని చేతిలో హత్యకు గురయ్యారు. ఆ ఘాతుకానికి పాల్పడిన గులాం రసూల్‌ హంతకుడికి ఉరిశిక్ష పడింది. ఈ విధంగా గులాం రసూల్‌ పోరాట జీవితం ముగిసింది. ( ' The Political Relations Between The Nawabs of Kurnool and The English East India Company', Syed Moosa Miah, Andhra Pradesh History Congress, Proceedings of the Ninth Session, Kurnool, 1985, P. 156 -157)

బ్రిటిషర్ల పెత్తనం సహించలేక, 1846 ప్రాంతంలోనే కర్నూలు జిల్లాకు చెందిన ప్రజానాయకుడు నరసింహారెడ్డి బ్రిటిషర్ల మీద తిరగబడితే ఆయనకు ఆ ప్రాంతానికి చెందిన మరో యోధుడు ముహమ్మద్‌ ఖాన్‌ అండగా నిలిచారు. ఆ సందర్బంగా నరసంహా రెడ్డికి హైదారాబాదుకు చెందిన సలాం ఖాన్‌ అను నాయకుడు కూడ సహకరించారు. (1846 Revolt of Rayalaseema : Some Releflections, N.Raghavendra, Andhra Pradesh History Congress, Proceedings of the Tenth Session,Guntur, 1986, P. 197)

ఆ సాహసయోధుడు నరసింహారెడ్డి చరిత్ర టెలీ సీరియల్‌గా కూడ ప్రసారం అయ్యింది. ఆ తిరుగుబాట్లు పటిష్టమైన పోరాట రూపాలుగా పరిణితి చెందక ముందే ఆధునిక ఆయుధాలు, శిక్షణ పొందిన సైనిక బలగాలు గల ఈస్ట్‌ ఇండియా కంపెనీ ఆ

141