పుట:1857 ముస్లింలు.pdf/145

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

తిరుగుబాట్లను నలిపి వేయడం, ఆ పోరాటాలకు పాపులర్‌ చరిత్ర గ్రంథాలలో తగిన చోటు లభించకపోవడంతో అవి ప్రజల మదిలో లేకుండా పోయాయి.

1857లో విజృంభించిన యోధులు

ప్రథమ స్వాతంత్య్ర సమరానికి పూర్వమే తిరుగుబాట్ల అపూర్వ వారసర్వం గల తెలుగు బిడ్డలు 1857లో తిరుగుబాటు యోధులు పూరించిన సమర శంఖారావాన్ని అందిపుచ్చుకుని బ్రిటిషర్ల పెత్తనాన్ని ఇక ఏమాత్రం సహంచేది లేదని సాయుధు లై కదిలారు. ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి రాజ్యవ్యవస్థ లేదా పాలనా వ్యవస్థను బట్టి ఆయా పరదేశాలలోని ప్రజానీకం స్థాయీ భదాలతో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రదమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు.

ప్రథమ స్వాతంత్య్ర సమరం సృష్టించిన ప్రకంపనలు నిజాం ప్రాంతాలలో కన్పించినంతగా, మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతమైన ఆంధ్రా ఏరియాలో కన్పించలేదు. భారత దేశంలోని ఇతర ప్రాంతాలలో లాగా మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతమైన ఆంధ్రలో పదవీచ్యుతులు గావించబడిన స్వదేశీపాలకులు లేకపోవటం దీనికి ఒక ప్రదాన కారణం కావచ్చు. నిజాం ప్రాంతంలో స్వదేశీ పాలకుడున్నా కూడ, అక్కడ బ్రిటిష్‌ రెసిడెన్సీ అధికారుల ఆధిపత్యం సాగుతున్నంన, స్వదేశీ సంస్థానాధీశుడు ఈస్ట్‌ ఇండియా కంపెనీ నుండి సైనిక సహాయం స్వీకరించి, ఆంగ్లేయుల పెతనాన్ని పూర్తిగా అంగీకరించినందు తమపై సాగుతున్న విదేశీయుల పెత్తనానికీ, ఆధిపత్యానికీ వ్యతిరేకంగా ప్రజలు, స్వాభిమానంగల యోధులు విజృంభించారు.

ఉత్తర భారత దేశంలో రగులుతున్న బ్రిటిష్‌ వ్యతిరేకత తిన్నగా దక్షిణ భారత దేశాన్ని కూడ చుట్టేశాక, నిజాం సంస్థానంలో కూడ ఆ ప్రభావం బలపడసాగింది. ఈపోకడలు ఎంత వరకు పోయాయంటే సంస్థానాధీశుడి పట్ల ఉన్న అభిమానం వలన ప్రభూ! పోరుబాట నడవండి మేం మీవెంట ఉంటాం అంటూ నేరుగా సంస్థానాధీశుడ్ని కోరేంత వరకు బ్రిటిష్‌ వ్యతిరేకత ఊపందుకుంది.

అఫ్జలుద్దౌలా... పోరుబాట నడవండి !

ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకులకు వ్యతిరేకంగా, ఆంగ్లేయుల ఆధిపత్యాన్ని

142