పుట:1857 ముస్లింలు.pdf/113

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

1857 తిరుగుబాటు యోధులలో ప్రముఖులైన మౌలానా ఫజలుల్‌ హఖ్‌ ఖైరతాబాదిని కూడ ఆంగ్లేయులు అండమాన్‌కు పంపారు. ఆయన ఢిల్లీ రెసిడెన్సీలో తహశీల్దార్‌ బాధ్య తలు నిర్వర్తిసూ,్తిరుగుబాటు ఆరంభం కాగానే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రముఖ కవి మీర్జా గాలిబ్‌కు సన్నిహిత మిత్రుడు. బహదూర్‌ షా జఫర్‌ నేతృ త్వంలోని ప్రబుత్వం రూపొందించిన రాజ్యాంగ రచనలో ఆయన భాగస్వామి. జ్ఞాన ప్రపంచంలో సుసంపన్నుడిగా పరిగణించబడిన ఆయన చేత అండమాన్‌ జైలులో అత్యంత కష్టతరమైన, అతి దుర్భరమైన చాకిరీ చేయించారు. అండమాన్‌ పంపబడిన మౌల్వీలను ఇతర యోధులను కరడుగట్టిన నేరస్థుల కంటే ప్రమాదకారులుగా జమకట్టడం వలన ఆంగ్ల అధికారలు, సైనికులు వారి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.

ఈ విధంగా మాతృభూమికి, కుటుంబాలకు, సన్నిహితులకు కడు దూరంగా పంపబడిన యోధుల కడగండ్లను, ఆ యోధుల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం వ్యవహరించిన భయంకర తీరుతెన్నులను మౌలానా ఫజల్‌ హఖ్‌ తాను రాసిన Risala-i-Ghadariyya బుక్లెట్ లో చాలా వివరంగా పెర్కొన్నారు. (The Heroes of Cellular Jail, S.N .Aggarwal, op.Cit.,) అండమాన్‌ జైలులో ఆంగ్లేయులు తిరుగుబాటు యోధుల పట్ల ఎంత కరినంగా ప్రవర్తించిందీ, ఎన్ని ఇక్కట్లుపెట్టిందీ ఆ కరప త్రం ద్వారా వెల్లడయ్యింది. ఈ కరపత్రం 1860లో అండమాన్‌ నుండి విడుదల అయిన ముఫ్తి ఇనాయత్‌ అహ్మద్‌ ద్వారా ఇండియాకు చేరుకుంది. ఆ తరువాత ఆ కరపత్రం నకలు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ తండ్రి మౌలానా ఖైరుద్దీన్‌ లాంటి కొందరు ప్రముఖులకు చేరింది. 1947 ప్రాంతంలో మౌలానా ఆజాద్‌ ఆ కరపత్రానికి సంబంధించిన ప్రచురణకు పరిచయ వాక్యం రాస్తూ ఈ కరప త్రం నకలు ఒకటి మక్కాలో గల తన తండ్రికి కూడ చేరిందన్నారు. (Bahadur Shah II, Mahdi Husain, P. 390)

1857 తరువాత కూడ తగ్గని ఆగ్రహం

ఈ విధంగా 1857లో తిరుగుబాటును ప్రోత్సహించిన, స్వయంగా తిరుగుబాటులో పాల్గొన్న మౌల్వీలు, మౌలానాలంటే ఆంగ్లేయులలో ఏర్పడిన విద్వేష

110