పుట:1857 ముస్లింలు.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మౌల్వీలు

భావం ఆ తరువాత కూడ కొనసాగింది. ఇస్లామీయా పండితుల వేషధారణ కూడ ఆంగ్లేయులకు అనుమానం కల్గించేది. తల మీదటోపి, గడ్డంతో ప్రత్యేకంగా దుస్తులు ధరించిన వారెవ్వర్ని చూసినా మౌల్వీలుగా ఆంగ్ల పోలీసులు అనుమానించటం సర్వ సాధారణమయ్యింది. ఈ అనుమానపు దృక్కుల నుండి రగిలిన విద్వేషాగ్నికి ఆంగ్లేయులతో ఏమాత్రం రాజీపడని వహాబీ యోధులు ప్రధానంగా బలయ్యారు. 1857 తరువాత ఆంగ్లేయాధికారుల మీద జరిగిన పలు విధాలైన దాడులలో పాల్గొన్నవహాబీల మీద పలు రకాల కఠిన శిక్షలు విధించబడ్డాయి.

ఈ యోధుల మీద పలు రకాల కుట్రకేసులను కూడ ఆంగ్లేయ ప్రభుత్వం బనాయించింది. ఈ కుట్ర కేసులలో 1864 నాటి అంబాలా కుట్రకేసు, 1865 నాటి పాట్నా కుట్రకేసులు చాలా ప్రధానమైనవి. ఇవి కాకుండ లాహోర్‌, థానేశ్వర్‌ తదితర ప్రాంతాలకు చెందిన బ్రిటిష్‌ వ్యతిరేక యోధుల మీద పలు నేరాలను మోపుతూ చాలా కుట్ర కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణలో దోషులుగా పరిగణించబడిన పలువురికి ఉరిశిక్షలు విధించగా, అధిక సంఖ్యాకులను అండమాన్‌కు పంపారు. ఈ విచారణలలో వహాబీ యోధులు మౌలానా యహ్యా అలీ,మౌలానా ముహ మ్మద్‌ జాఫర్‌ థానేశ్వరి,మౌలానా ముహమ్మద్‌ లాహోరిలకు ఉరిశిక్షలు విధిస్తూబ్రిటిషు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను పరిశీలించినట్టయితే ఇస్లామీ పండితుల పట్ల బ్రిటిషర్లలో గూడు కట్టిన కసి విద్వేషం అర్థమౌతుంది. ఈ కేసులలో ఒకదాని మీద తీర్పునిస్తూ మీ ప్రాణాలు పోయేంత వరకు ఉరికి వేలాడదీస్తాం. మీ ఆస్తులను జప్తు చేస్తాం. మీ మృతదహాలను మీ బంధువులకు అప్పగించక పోగా అత్యంత అవమానకర పద్ధతిలో జైలు ప్రాంగణంలోనే ఖననం చేస్తాం, అని ఒక న్యాయమూర్తి ప్రకటించాడు.

(You will be hanged till death, your properties will be confiscated and your corpses will not be handed over to your reletives. Indeed, you will be burried contemptuously in the jail compound.- Muslims In India, S.Abul Hasan Ali Nadwi, Islamic Research and Publictions, Lucknow, 1980, P.113)

1871లో అబ్దుల్లా అను యోధునికి విధించిన ఉరిశిక్ష సందర్భంగా ఆయన మృతదేహాన్నిఅంత్యక్రియల కోసం అప్పగించమని బందువులు కోరినా, నిరాకరించిన ఆంగ్లేయాధికారులు, మత సంప్రదాయం ప్రకారంగా ఖననం చేయాల్సిన అబ్దుల్లా

111