పుట:1857 ముస్లింలు.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మౌల్వీలు

సాక్షాత్కరింపజేశారు.

ఆయన కార్యక్రమాలలోని నిజాయితీని ప్రస్తావిస్తూ,' The Moulvi was a true patriot. He had not stained his sword with assassination. He had connived at no murders; he had fought manfully, honourably and stubbornly in the battle field against the strangers, who had seized his country, and his memory is entitled to the respect of the brave and the truehearted of all nations ' అని ఆంగ్లేయ అధికారులు మౌల్వీ అహ్మదుల్లా ఫైజాబాదిని ఎంతగానో కీర్తించాల్సి వచ్చింది. (The Indian Mutiny of 1857 Vol. IV : Colonel G.B. Malleson, P.381 )

ఈ విధగా ప్రఖ్యాత ఇస్లామియా పండితు డైన మౌల్వీ అహ్మదుల్లాషా పైజాబాది కలం స్థానంలో కత్తిపట్టి ఆంగ్లేయులను తుదముట్టించేందుకుస్వయంగా రణరంగ ప్రవేశం చేశారు. ఆయన ధైర్యసాహసాలు ఆనాడు ఇతర ప్రాంతాలలోని మౌల్వీలకు మాత్రమే కాకుండా స్వదేశీ పాలకులకు, సైనికులకు, ప్రజలకు గొప్ప ప్రేరణ అయ్యాయి.

మౌల్వీ ప్రేరణతో మౌలానా గులాం ఇమాం షహీద్‌, మౌల్వీ షేక్‌ అలీ బేగ్, మౌల్వీ ఇమాం బక్ష్ సాహబి, మౌల్వీ ఖ్వాజా తురబ్‌ అలీ, మౌలానా గులాం జిలాని, మౌల్వీ తుఫైల్‌ అహ్మద్‌ ఖైరతాబాది, మౌలనా ముహ్మద్‌ ఖాసిం దానాపూరి, మౌల్వీ ఫజల్‌ అహ్మద్‌ బదౌని, డాక్టర్‌ వజీర్‌ ఖాన్‌, మౌల్వీ కరీముల్లా షాలాంటి పలువురు ప్రముఖ ఇస్లామియా పండితు లు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరుబాట సాగారు. (Mus- lims and India’s Freedom Movement, Shan Muhammad, IOS, 2002 , Page.26)

కలం స్థానంలో కత్తిపట్టిన ఉపాధ్యాయుడు

మౌల్వీ అహ్మదుల్లా పైజాబాది బాటలో నడిచిన వారిలో అలహాబాద్‌కు చెందిన మౌల్వీ లియాఖత్‌ అలీ ముఖ్యులు. ఆయన ధార్మిక పండితులు. ధార్మిక పాఠశాలల్లో, పలువురు ప్రముఖులకు ఆయన విద్యాబోధన చేశారు. ఈ క్రమంలో పలు ప్రాంతాలను సందర్శించిన మౌల్వీ స్వజనుల ఆంగ్ల అధికారులకు దాసోహం అంటున్న దుస్తితి చూశారు. ఆయన స్చయంగా ఆంగ్ల సైన్యంలో చేరి సైనికులను ప్రబుత్వానికి వ్యతిరేకంగా రచ్చగొట్ట సాగారు. ఆ కారణంగా ఆయనను సైన్యం నుండి తొలిగించారు. మంచి ధార్మిక పరిజ్ఞానంగల ఆయన ధార్మిక భోధన ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఆ ఆవకాశాన్ని

103