పుట:1857 ముస్లింలు.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1857: ముస్లింలు

వినియోగించుకుని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టసాగారు. ఆ విధంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాగుతున్న మౌల్వీ లియాఖత్‌ అలీ ప్రథమ స్వాతంత్య్రసంగ్రామంలో కలం స్థానంలో కత్తి పట్టారు. ఆయన స్వయంగా సాయుదుడై స్వదేశీ బలగాలను ముందుకు నడిపి ఆంగ్ల సైనికులతో పోరాడి అలహాబాద్‌ను ఆంగ్లేయుల చెరనుండి విముక్తం చేశారు. మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ ప్రతినిధిగా ప్రకటించి ఆయన స్వదేశీ పాలన సాగించారు.

మౌల్వీ గొప్ప వ్యూహకర్త మాత్రమే కాకుండా గొప్పకవి కూడ. ప్రజలను విముక్తి పోరాటం దిశగా నడిపించేందుకు, తిరుగుబాటు యోధులలో స్పూర్తిని కలుగ చేసేందుకు పైగామ్‌-యే-అమల్‌ (ఆచరణ సందేశం) అను కవితను రాశారు. ఈ కవిత ద్వారా భారత దేశం ఔన్నత్యాన్ని ప్రశంసించటం మాత్రమే కాకుండ హిందూ- ముస్లిం-సిక్కుల మధ్య ఐక్యతను కోరారు. ఈ కవిత నానా సాహెబ్‌ ఆంతరంగి కుడు అజీముల్లా ఖాన్‌ తన సంపాదకత్వంలో ప్రచురితమైన పయామే ఆజాది/ పైగామ్‌- యే-ఆజాది అను పత్రికలో ప్రచురించారు.

ఈ పరిస్థితులను ఏమాత్రం జీర్ణించుకోలేక పోయిన ఆంగ్లేయాధికారులు సాయుధ బలగాలు, ఫిరంగులతో అలహాబాద్‌ను చుట్టుముట్టారు . శిక్షణ పొందిన సైనికులు లేకపోయినా, ఆయుధాలు అంతంత మాత్రంగానే ఉన్నా మౌల్వీ ఆంగ్ల సైన్యాలను ఎదుర్కొన్నారు. చివరకు చీమల దండులా ముంచుకొచ్చిన ఆంగ్ల సైనికులకు విజయం లభించింది. మౌల్వీ ఆంగ్ల సైనికుల కళ్ళుగప్పి 1857 న్‌ 17న అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయనకు సంబధించిన సమాచారం అందిస్తే ఐదు వేల రూపాయల బహుమతిని కూడ ఆంగ్ల ప్రభుత్వం ప్రకటించినా ఆయనను నిర్బంధించటం చాలా కాలం వరకు సాధ్యం కాలేదు.

మౌల్వీ లియాఖత్‌ అలీ బొంబాయి చేరుకున్నారు. ఆ తరువాత కొంత కాలం గడిచాక వెంటాడుతున్న పోలీసులు అయనను అరెస్టు చేసి రాజద్రోహం, బ్రిటిష్‌ అధికారుల, సైనికుల హత్యా నేరం, ప్రజలను తిరుగుబాటుకు రెచ్చగొట్టడం మొదలైన నేరాలను కంపెనీ ప్రబుత్వం ఆరోపించింది. ఈ ఆరోపణల మీద 1857 జులై 24న బొంబాయిలో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఎంతో నిర్భయంగా మాతృభూమి పట్ల తనకున్న ప్రేమ, అభిమానాలను, వలస పాలకుల పట్ల ఉన్నవిద్వేషాన్ని స్పష్టంగా

104