పుట:1857 ముస్లింలు.pdf/103

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


1857: ముస్లింలు

ఇండియా కంపెనీ ప్రబుత్వంలో మౌలానా ఫజల్‌ హఖ్‌ అధికారిగా బాధ్య తలు నిర్వహిస్తున్నా ప్రజలు ధర్మపోరాటానికి సిద్ధం కావాలని ఎంతో సాహసంతో ప్రకటించారు.(Hindu-Muslim Question and Our Freedom Struggle, KM Ashraf, Volume I, Sunrise Publications, New Delhi, 2005, P.18)

ఈ విధంగా ప్రకటించటం ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా మౌలానా ఇమ్‌దాదాుల్లా, మౌలానా ముహమ్మద్‌ హఫీజ్‌ జమీర్‌ అహ్మద్‌ తదితరుల తోపాటుగా 30 మంది ప్రముఖ ధార్మిక పండితులు ఫత్వా మీద సంతకాలు చేసి తిరుగుబాటుకు తమ అంగీకారాన్నితెలిపి ప్రజలను, తమ అనుచరులను బ్రిటిష్‌ పాలకుల మీద యు ద్ధా ని కి పురికొల్పారు . (Untold Story of Freedom Struggle by M.Burhanuddin Qasmi Milli Gazette (Fortnightly), 16-31 May 2007, New Delhi, P. 4)

1857 పోరాటం ఆరంభం కాకముందే మొఎల్వీలు తిరుబాటు భావాలను ప్రజలలో నాటడం ప్రారంభించారు. ఆ క్రమంలో చురుకుగా కృషి చేస్తున్న వహాబి ఉద్యమకారుడైన మౌల్వీ మహాది మీద ప్రజలను తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నాడన్న నేరారోపణ చేసి పాట్నా కలక్టరు నిర్బంధించాడు. ఆ తరువాత షా ముహమ్మద్‌ హుసెన, వాజుల్‌ హఖ్‌ అను ఇద్దరు మొఎల్వీలను మంచి మాటలతో తన కార్యాలయానికి పిలిపించుకున్న కలెక్టరు వారిని నిర్బంధంలోకి తీసుకున్నాడు.

బ్రిటిషు వ్యతిరేక వాతావరణాన్ని 1857 ముందుగానే మౌల్వీలు సృష్టించి ఉండటంతో 1857 పోరు ఆరంభ కాగానే పాట్నాకు చెందిన గ్రంథ విక్రేత షేర్‌ అలీ నాయకత్వంలో పాట్నా కేంద్రంగా తిరుగుబాటు ప్రజ్వరిల్లింది. ఈ సంఘటను త్వరితగతిన అదుపులోకి తెచ్చిన ఆంగ్లేయాధికారులు పీర్‌ అలీతోపాటుగా సుమారు రెండు వందల మందిని బలి తీసుకున్నారు.

ఆంగ్లేయులను పరుగులు పెట్టించిన అహ్మదుల్లా

మౌల్వీలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా షామ్లి కేంద్రాంగా పోరాటం చేయగా అంతకంటె తీవ్ర స్థాయిలో ఉత్తర ప్రదశ్‌లోని పెజాబాద్‌కు చెందిన ఇస్లామియా పండితు డు మౌల్వీ అహ్మదాుల్లా షా ఫైజాబాది పరాయి పాలకులకు వ్యతిరేకంగా కత్తిపట్టి చరిత్ర సృష్టించారు. 16 ఏండ్ల వయస్సులోనే లండన్‌తో పాటుగా పలు విదేశాలను సందర్శించి

100