పుట:1857 ముస్లింలు.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మౌల్వీలు

వచ్చిన ఆయన రాజఫుఠానాలో గల ఇస్లామిక్‌ పండితుల శిష్యరికంలో ఇస్లామియా ధార్మిక గ్రంథాలలో పరిజ్ఞానం సంపాదించారు. అనంతరం ధార్మిక ప్రచారం గావిస్తూ, గ్వాలియర్‌కు చెందిన గురుదేవులు హజ్రత్‌ మహరబ్‌ షా ఖలందార్‌ ఆదేశాల మేరకు స్వదేశీయుల మీద ఆంగేయులు సాగిసున్న పెత్తనం, జులుం చూసి సహంచలకపోయారు. ఆగ్రాలోని ముఫ్తి ఇందాదాుల్లా గృహాన్ని తన కేంద్రంగా చేసుకుని కలం స్థానంలో కత్తికి ప్రాధానత్యనిచ్చి ఆంగ్లేయుల మీద యుద్ధానికి ఆయన సిద్ధమయ్యారు.

ఆది నుండి ఆంగేయుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన మౌల్వీని ప్రమాదరక వ్యక్తిగా పరిగణించి ఆంగ్లేయాధికారులు బంధించి చెరశాలలో వేశారు. 1857 జూన్‌లో

సమరశంఖారావం పూరించిన స్వదేశీ యోధును ఫిరంగి గొట్టాలకుకట్టి పేల్చి వేస్తున్నఆంగ్లేయులు

తిరగబడ్డ ప్రజలు ఆంగ్లేయుల చెరశాల నుండి ఆయనను విముక్తుడ్ని గావించారు. ఆ తరువాత ఆయన తన అనుచరు లతో కలసి స్వంత సైన్యాన్ని తయారు చేసుకుని ఆంగ్లేయ సైనికులు తారసపడిన చోటల్లా వారిని ఎదుర్కొని పలుమార్లుమట్టి కరిపించారు.

ఈ పోరాటాలలో భాగంగా ఆయన స్వదేశీ యోధులైన నానాసాహెబ్‌, బేగం హజరత్‌ మహల్‌, షెహజాదా ఫిరోజ్‌షాల బలగాలకు తన బలగాలను తోడుచేసి ఆంగ్ల సెనికాధికారులను పరాజితులను చేశారు. ఈ యోధుని విక్రమాన్ని ఎదుర్కొలేకపోయిన కంపెనీ అధికారులకు ఆయనను పట్టిచ్చిన వారికి 50 వేల రూపాయల నజరానా

101