ఈ పుటను అచ్చుదిద్దలేదు
68
కాళిదాస చరిత్ర్త
తా॥రాజుల కిరీటములయందలి మణులచేత నలంకరింపబడిన పాదపీఠము గలిగి సాహనాంకుండెను. బిరుదుగలిగిన యో రాజా! కావ్యము చేయగలను, కాని యంతచక్కగా జేయలేను. ప్రయత్నము చేసిన పక్షమున జక్కగాగూడ జెప్పగలను. దేవరవారి సెలవేమి? కవిత్వము చెప్పుదునా, నేత నేసికొందునా యిల్లువిడిచిపొదునా?
అనవుడు రాజు వానిపాండిత్యము కచ్చెరువడి రవింతపండితుడన్నమాట మే మెఱుగము నె వెక్కడికిం బొనక్కరలేదు. నీయింట నీవుండు మని చెప్పి వానిం బంపివేసెను.
కు టుం బ క వు లు
మాళవ దేశమునందొక
గ్రామమున బ్రాహ్మణు
డుండెను. అతడు, నతని భార్య్లయు, నతిని కుమరుడు, నతని కోడలు నలుగురు గొప్ప పాండిత్యము సంపాదించిరి. నలుగురు గవిత్వము చెప్పగలిగిరి. ఒకనాడు భోజమహారాజు పండితకవిజన పరివేష్ఠితుడై సభాభవన మలంకరించియుండ బ్రాహ్కణుడు సకుటుంబముగా మహీపాలుని సందర్శించి యాశీర్వదించి "రాజా! మేమందఱము గవిత్వము జెప్పుదము పరీక్షించి మమ్ము సన్మానింపుడు" అని విన్నవించెను. ఆకుటుంబ కవులనిజూచి రాజు సంతసించి యీ క్రింది సమస్య పూరింపమని వారి కిచ్చెను.
"క్రియాసిద్ది: సత్త్వే భవతి మహతాం; నోపరణె"
తా॥మహాపురుషులయొక్క కార్యసిద్ధి వారి మహిమయందే యుండును గాని సాధనసామగ్రి యందుండదు.
ఆ సమస్య్లను గ్రహించి బ్రాహ్మణుడు ముందుగా నీ క్రింది విధమున బూరించెను.