67
కాళిదాస చరిత్ర
జేసికొననప్పటీ వయస్సు చెల్లిపొయి శరీరము శిధిలమగును. ఎందుకు నీ పాండిత్యము? తగులబెట్టనా? సంసారసుఖ మనుభవించినవాడవు గావు; దానిమీద గాంక్ష లేకపోయినపక్షమున వైరాగ్యముగలిగి తపస్సు చేసికొన్నవడవు కావు; ఈ రెండింటికిని జెడినవాడవైతివి.
భార్యాస్వహస్తలిఖితమైన యాశమ్మజూచుకొని యా పండితుడు సిగ్గుదెచ్చుకొని కటకమును విడిచి ధారాపురము ప్రవేశించి భార్యతో సుఖముగాగాపురము చేసెను. ప్రాచీనకాలముల్నందు స్త్రీలు విద్యాభ్యాసము విశేషముగా జెసిరనుట కిట్టి నిదర్శనము లనేకములు గలవు.
సా లె వా డు
ధారాపట్టణమున
నొక సాలెవాడు
కలడు, అతడు కులవృత్తివలన జీవనము చేయుచున్నను, సంస్కృత సాహిత్యముగలిగి కవిత్వము చెప్పగలిగి;యుండెను. ఒకనాడు భోజరాజు తనపట్టణమందు విద్యావిహీనులైనవారిని గృహముల లొనుండి లేవగొట్టి వారియిండ్లు పండితుల కీయవలసి న దని యాజ్ఞాపించెను! సేవకులు వాడవాడలకు బొయి విద్యావిహీనులైనవారిని రాజసమ్ముఖమునకు గొంపోయిరి. సాలెవాడు తాను పండితుడయ్యు దన ప్రజ్ఞ నెవరికిం దెలియకుండ నివురుగప్పిన నిప్పుచలె నుండి బట్టలు వేసికొనుచుండుటచే వడు నిరక్షరకుక్షి యని భావించి సేవకులు వానిని రాజుకడకు గొనిపోయిరి. "నీవు విద్యావిహీనుండవు కావున నీ యిల్లువిడచి స్ధలాంతరమునకు బోవలయు" నని రాజు వానితొ బలికెను. అప్పుడతడీ క్రించిశ్లోకరూపమున రాజునకు బ్రత్త్యుత్తతమిచ్చెను.
శ్లో॥కావ్యం కరోమె న హి చారుతరం కరోమి,
యత్నాత్ కరోమి యది, చారుతరంకరోమి,
భూపాలమౌళిమణరంజితసాక,
హేసాహసాంక, కవయామి, వయామ్నియామి