ఈ పుటను అచ్చుదిద్దలేదు
65
కాళిదాస చరిత్ర
రుండెనట. ఆమె బాల్యమునందే వితంతువగుటచేత రత్నభేటదీక్షితులు పుత్రికాజీవితము నిరర్దకముగాకుండ జేయదలచి యామెకు గ్రమక్రమముగా గావ్యనాటకాలంకారగ్రంధములు చెప్పి పిమ్మట దర్కవ్యాకరణములం దభినివేశ్డము గల్గించి గొప్ప విద్వాంసురాలుని జేసెను. ఆమె తండ్రికి బహు విధముల నుపచరించుచుండెను. విద్వాంసురాలైనను నిరంతరము విద్యాగొష్టియందేకాలముగడపక తల్లికి దోడ్పడి గృహకృత్యములుగూడ నెఱవేర్చుచు మంచి పేరు సంపాదించెను.
ఒకనాడు రత్నదీక్షితుడు గ్రామాంతరమునకరిగి యుండగా నతినితొ వాదముచేయవలయునని తర్క వేదాంతాదిశాస్త్రముల యందు నిరుపమాన పాండిత్యముగల యొక గొప్ప విద్వాంసుడు వచ్చి 'దీక్షితులుగారున్నారా?" యని యడిగెను. "ఎంచు" కని కూతురడుగగా " వాదముచేయవచ్చితి" నని యతడు చెప్పెను. అప్పుడామె చిఱునవ్వు నవ్వి యీ క్రింది శ్లోకము జెప్పెనట:--
శ్లో॥విపశ్చితా మపశ్చమే వివాదకేళినిశ్చలే
నపత్నసి త్యయత్నమేన రత్నబేటాదీక్షితే
బృహస్పతి: ప్రజల్పతిప్రసర్పతి క్వనర్పరా
దనమ్ముఖశ్చ షణ్ముఖ శ్చత్రుర్ముఖశ్చతుర్ముఖ:,
తా॥పండితులలో నగ్రగణ్యుడు, శత్రువులను జయించు వాడును నైన రత్నభేంటదీక్షితులు వివాదమునకు సిద్దమైనప్పుడు ప్రయత్నము లేకుండగనే వానిముందట బ్రహస్పతి ప్రేలరియగును. వేయి నాలుకలుగల యాదిశేషుండు ప్రసరింపజాలడు. ఆఱుమొగములుగల కుమారస్వామి తెల్లమొగమువేయును. చతుర్ముఖుడు దుర్ముఖుండగును.
ఈ శ్లోకము వినగానే యాక్రొత్తపండితుడు "అమ్మా! దీక్షితులు గారు నీ కెమగుదురు!" అని యడిగెను. "ఆయన మాతండ్రియే" యని