పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/73

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


64

కాళిదాస చరిత్ర

రాజు: కవా బాలా?=ఎవతెవేపిల్లా నీవు/
బాలిక: కాంచనమాలా=నాపేరు కాంచనమాల
రాజు; కస్యాపుడి?=ఎవరి కూతురవు
బాలిక: కనకలతాయా:=కలకలతయొక్క కూతురను
రాజు: కింవా హస్తే?=చేతిలొని దేమిటి?
 బాలిక: తాళజపత్రం = తాటియాకు.
రాజు: కావాలేఖా:?=దానిమీద వ్రాసినదేమిటి?
బాలిక: కాభాగాఘా:=కాఖాగాఘాలు

ఇదియంతయు నీక్రిందిశ్లోకమగును--

శ్లో॥ కవాబాలా? కాంచనమాలా,
      కాస్యాపుత్రీ? కనకలతాయా;
      కింవా హస్తే? తాళజపతం
      కావాలెఖా:? కాఖాగాఘా:

    ఆహాహా! చూచితిరా కాఖాలు వ్రాసికొనునట్లేచిన్న బాలిక పుస్తకమైనను బట్టని సమయమునగూడ బొజమహారాజుతో గీర్వాణభాషలో సంభాషించెను. ఆ కాలమునందలి విద్యాభివృద్ది కింతకన్న వేఱు నిదర్శన మేమికావలయును? ఆకాలమున సంస్కృతభాషయే మాతృభాషగా జనులచేత సంభాషింపబడుతున్న దని దీనినిబట్టి యూహింప వచ్చును. 

ర త్న భే ట దీ క్షి తు డు

ఈమహారాజుధారాపుర

పరిపాలనము చేయుకాలమున

నచ్చట రత్నదీక్షితులను పండితు డుండెను. ఆయన నిరంకుశ ప్రతిభాశాలి-అమితమేధానిధి-పాందిత్యమునం దద్వితీయుడు.అతనికి రానిశాస్త్రము, రానికళ ప్రపంచమునలెదు,అతనికొక్క కూతు