21
కాళిదాస చరిత్ర
నామె పాడుచున్నను వాడు చెక్కుచెదరక నిద్రపొవుచుండెను. అంతటనామె చారక్రాంతియె మెల్ల మెల్లగా జెవితేశ్వరుని మంచముకడ కేగి మెలకువ వచ్చునేమో యని యించుక పన్నీరు వాని మేనిపైన జిలికెను. అది కాఱుదున్నపోతుమీద వర్షము కురిసినట్లు వానియెడ బ్రయొజనకారి కాదయ్యెను. అంతట నామె మెల్లగా మీదజేయివైచి సన్నసన్నముగా దనకంఠమెత్తి గానముచేసెను. అతడొకసారి కన్నెత్తిచూసి "ఓసే, గుయిగుయిలాడక తొంగోసి "యని యామె చేయిదీసివైచి మరల నిద్రపోయెను. అప్పుడామె భయసంశయాకులాత్మయై యావైచిత్య్రమేమో కనుగొనదలచి క్షణకాలమూరక కూర్చుండి మరల నాతనిమీద జేయివైచి తట్టి లేపెను. అతడు మెలకువ దెచ్చికొని 'యెందుకులేపినా" వని బిగ్గరగా నడిగెను. అందుకామె ధైర్యము దెచ్చుకొని "మెరెరెవ్వరు? మిక్కడికి దోడితెచ్చినవారెవ్వరు? మీవృత్తాంతమేమి? " యని యడిగెను.. అప్పుడతడు తనచరిత్రమంతయు మోటమాటలతో నెంతో రసహీనముగా నామెతొచెప్పెను. ఆ వృత్తాంతమువిన నామె మొగము చిన్నబోయెను. నెమ్మేను జలదరించెను. మనస్సు క్రుంగిపోయెను. రాజపుత్రి యగుటచే నెట్టకేలకు ధైర్యము దెచ్చుకొని తన మనసులొ నిట్లని విచారించెను.
"ఆహా! దైవమా! నాలేంబ్రాయము, నాజవ్వనము, నాచక్కదనము బూడిదబోసిన పన్నీరు తెఱంగున నడవిగాచిన వెన్నెల నడువున, జవిటినేల గురిసిన వానపోలిక, నిరర్ధకమయ్యెగదా! సుక్షత్రియుడై, సత్కులజాతుడై, సౌబాగ్యనిధియై, విద్యావిషయ వివేక సంపన్నుడై, యీడుజోడైయుందు ప్రాణనాధుని చెట్టబట్టి సౌఖ్యసాగరమందు దేలునట్టి భాగ్యము నాకు కలుగదయ్యెగదా! కొఱనోములు నోచి యధికఫలము గావలెనన్న నెట్లువచ్చు? ప్రాణనాధుడు మెచ్చని