పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుటను అచ్చుదిద్దలేదు
12

కాళిదాస చరిత్ర

డెనడు గనపడడు వాడు తనదారుణ తపముచే దిక్పాలకుల దమ పదవులనుండి దిగద్రోచి వాటిని దానాక్రమించుకొనుటేనని చూచుచున్నట్లు కనపడుచున్నది. ఈమహావిపత్తునుండి మీరుమమ్ము దప్పింపవలయును. ఈస్వర్గసామ్రాజ్యమునకు రాక్షసులవలన భయము, మహర్షులవలన భయముగూడకలదు. రాక్షసభయమును శ్రీమన్నారాయణుడు పెక్కుసారులు నవారించెను. ఈపని బ్రహ్మవిష్ణు మహేశ్వరుల వలనగాదు. మన్మధుడుచేయవలెను. మన్మధుని చేతికనారులైన మీవంటి మిఠారులు చేయవలెను. మీరునాయాజ్న దాట్నిబోటులగుటచే నాపనితప్పక నెరవేర్తురని నమ్మకముతో మన్మధుని బిలువనంపలేదు. మీచేష్టలముందు వారినిష్టలు నిలుచునే? మీగానంబులముందు వారిమౌనంబులు మాయముముగాకుండునే? మీచిఱునవ్బుల జూచిన వారినియమములు దవ్వుల కరుగవే ? మీరూపంబు జూచిననాకుమదన తాపంబు పాలుగాకుందురే? మీకరారవిందస్పర్శనమైనప్పుడు పులకింపుకుండుటకు వారిమేనులు దేహములుగాక లోహములా? కావున మీరీక్షణంబు యరిగి నాకార్యసిద్ధిచేయుడు, మీకుమంగళమగుగాక! “అనినీదుకొల్చిననామెలుతలు” మనమహాముని మనస్సుకలపగలమా? ఆమహాత్మునికోపముచే సగముశాపముపాలగుదుమేమోగదా!” యనిశంకించుచు మనమింతమాత్రపుపని చేయజాలమాయని ధైర్యముదెచ్చుకొని తలపంకించుచు స్వర్గమునుబాసి దుర్గమమగు నాయాశ్రమమును నశ్రమునుజొచ్చి మూర్తీభవించిన బ్రహ్మతేజంబుపగిది నాకారంబు ధరియించిన శాంతరసముభాతి, నంగంబులు దాల్చిన తపోదేవతవలె వ్యాఘ్రచర్మోత్తరీయుడై రుద్రాక్షమాలాలంకృతుడై హృదయ పద్మపణిహిత శివుడై బద్దపద్మాసంస్థుడై చిరకాలసముసముపార్జిత తపోధనుడై ఘను