Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
3]

13

కాళిదాస చరిత్ర

వైయున్న యామహామునిని సందర్శించి భయసంభ్రమంబుకచేత నించుక నడకి యెట్టకేలకు ధైర్యముదెచ్చుకొని మెల్లమెల్లన నాతనిజేరి పూజకు నానావిధ పుష్పములు దెచ్చి ఇచ్చియు, నగ్నిహోత్రములకు సమిధలందిచ్చియు నారబట్టల దడిపి యుదికి యారవైచియు, బర్ణశాఅ శుభ్రముగా నూడ్చియు, నతనికి కొంతకాలము శుశ్రూషజేసిరి. పిమ్మట నతడు కొంతచనవిచ్చుటయు,నతని మనసానంద సముద్రమున వొలలాడునట్లు కిన్నెరుల వంటి కంఠములనెత్తి యొకమాఱు గానముచేయుదురు ఒక మాఱు మందహాసముఛెయుదురు. ఒకసారి వికవిక నవ్వుదురు. ఒకసారి భయవినయంబులతో నమస్కరింతురు. ఇట్లనేక విలాసంబుల జూపి యాతనిం దమవలలో వైచికొని కొట్టకొనకు దమదాసునిం జేసికొనిరి. అంతట నాముని హోమాగ్నిని విడిచి కామాగ్నిపాలయ్యెను. యోగంబుపోయి రాగంబు వాని నాశ్రయించెను. చిట్టచివర కాతడు నిష్ఠవిడిచి, నియమమువిడిచి, జపమువిడిచి, ధ్యానమువిడిచి, మానము విడిచి నిరంతర స్త్రీలోలుడై భోగపరాయణుడై పరలోకంబు మఱచి కామినీలోకంబు నమ్ముకొని వరి "కటాక్ష వీక్షణములె రక్షణములుగ, వారిచరణంబులె శరణంబులుగ సిగ్గువిడిచి విరహింపజొచ్చెను.

ఆహాహా! కాముకులకు సిగ్గుశరము లుండునా? భయభక్తులుండునా? అటులుండ నొకనాడు సనకసనందనులు, నాలాఖిల్యులు, మొదలగు మహర్షులు తన్మార్గంబునంబోవుచు నాయాశ్రమంబు బ్రవేశించి చిరంతపుడు మహోగ్రతపము చేయుచున్నాడనుకొని యాతని సందర్శింపవలెనని యతడున్న చోటికంజనిరి. వారనుకొనినట్లతడు తపోవ్యాపారములయందు నిమగ్నుడుగాక, కామ వ్యాపారములయందు నిమగ్నుడై యుండుటంజూచి