Jump to content

పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
13]

93

కాళిదాసు చరిత్ర

యొక్క వ్రేలు వ్యాసవిగ్రహముయొక్క బొడ్డులో నిఱికికొనిపోయి యూడిరాదయ్యెను. అప్పుడు కాళిదాసుడు పదునెమిది పురాణములు రచియించి, బ్రహ్మసూత్రములువ్రాసి, వేద విభాగముజేసిన నారాయణావతారమని వ్యాసమహర్షినినిష్కారణముగా నిట్లు తూలనాడితి నే యని పశ్చాత్తాపముజెంది యిట్లు వినుతించెను.

శ్లో॥వ్యాసం వసిష్ఠనస్తారం, శక్తే: పాత్ర మకల్మషం
   పరాశరాత్మణం వందే శుకతాతం తపోనిధమ్

తా॥వసిష్టుని మునిమనుమడును, శక్తి మహాముని మనుమడును, పాపరహితుడును, పరాశరునిపుత్రుడును, శుకునితండ్రియు దపోనిధియు నైన వ్యాసునకు నమస్కరించుచున్నాను.

శ్లో॥ అచతుర్వదనో బ్రహ్మ, ద్విబాహురపరోహరి:
    అఫాలలోచనశ్శంభు, ర్భగనాన్బాదరాయణ.
  

     —సద్గుణైశ్వర్యసంపన్నుడైన బాదరాయణుడు నాలుగు ంఒగములు లేని బ్రహ్మ, రెమదుచేతులుగల విష్ణువు, మూడవ కన్నులేని శంభుడు అనగా రూపమున బ్రహ్మవిష్ణుమహేశ్వరులను బోలడుగాని మహిమమందు వారితో సమానుడేయని దీనిభావము.
   ఈరెండుశ్లోకములకు మిక్కిలి సంతసించి సాత్యవతేయుడు ప్రత్యక్షమై “వత్సా! కాళిదాసా! చరకారకుక్షియని న న్నధిక్షేపించితివి. ఏదీ నీప్రజ్ఞ చూతము ధర్మజభీమార్జుననకులసహదేవులు ద్రౌపదికి మగలై, మఱదులై, బావలై యుందురనుభావము చకారములులేకుండ నొక్క యనుష్టపుశ్లోకమున జెప్పునాయనా“యని పలికెను. వెంటనే కాళిదాసుడు “స్వామీ! మీయనుగ్రహమున్నచో నదియెంతపాటిది“ యని యీక్రింది శ్లోకము జెప్పెను.

   శ్లో॥ద్రౌపద్యా: పాండుతనయా, పతిదేవరభావుకా:
      నదేవరో ధర్మరాజ స్సహదేవో న భావుక