కాళిదాస చరిత్ర
తొమ్మిది వ్యాకరణములు చదివినతరువాత వేదసంస్కరణమునకు బూనవలయును. అయిదు వ్యాకరణములు చదివి యసంపూర్ణజ్ఞానముగల మనకు వేదమున దోషములు కంపట్టుచున్నవి. తొమ్మిదిచదివినపక్షమున దోషములు కనబడవు. కావున మీప్ర్యత్నము ఇరమింపుడు” అనిమందలింప వారందఱు మిన్నక గృహములకుబోయిరి.
చ కా ర కు క్షి
కాళిదాసు తీర్ద
యాత్రలు సేవించు
తలుపున నయోధ్యా, హరిద్వారము, మధుర, ద్వారక మొదలగు దివూస్దలముల సేవించి, ప్రయాగయందలి త్రివేణీసంగమంబున స్నాన మాడి, పుణ్యరాశియైన కాశికిబోయెను. అచ్చట నమ్మహాకవి భాగీరధియందు స్నానమాడి, విశ్వేశ్వరస్వామిని వినుతించి, దుండి విఘ్నేశ్వరుని స్తుతియించి, కేశవస్వామినిగీర్తించి, యన్నపూర్ణాదేవియడుగులకు మ్రొక్కి, హరిచ్చంద్రుడు భార్యనమ్మినచోటు, వేదవ్యాసుడు బిక్షమెత్తునచోటు, వీక్షించి యానందించి యవిముక్తక్షేత్రముననున్న వేదవ్యాసుని విగ్రహంబునకు నమస్కరించి, దానిబొడ్డున దనవ్రేలుపెట్టి ‘చకారకుక్షి ‘ యని చమత్కారముగా బలికెను. కడుపునిండా చకారములున్నవని దానియర్దము. అనగా బాదరాయణుడు సంస్కృతముంస మహాభారతమును, నష్టాదశ పురాణములను అచియించినప్పుడు రెండుమూడు వస్తువులనిగాని, యిద్దఱుముగ్గురు పురిషులనుగాని, చెప్పినప్పుడు “ధర్మరాజశ్చ భీమశ్చ నకులశ్చ“యని చకారములు తరుచుగా ప్రయోగించుచువచ్చెను. అందుచే గాళిదాసు డట్లాక్షేపించెను. వేదవ్యాసునకు మహాగ్రహముకలిగెని. అతని మహిమవలన గాళిదాసు