పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


కాళిదాస చరిత్ర

కాలనిర్ణయము

    శ్లో॥ధన్వంతరి9క్షిపణకామరసింహశంకు
         భేతాళభట్టుఘటకర్పర కాళిదా.సా:,
         ఖ్యాతో వరాహమిహిరో నృపశేస్సభాయాం
         రత్నాని వరరుచి ర్ననవిక్రమస్య.

అనియొక పురాతన శ్లోకముకలదు. దీని యర్ధ మేమనగా 1. ధన్వంతరి, 2. క్షపణకుడు, 3. అమరసింహుడు, 4. శంకుచి, 5. భేతాళభట్టు, 6. ఘటకర్పరుడు, 7. కాళిదాసు, 8. వరాహమిహిరుడు, 9. వరరుచి. ఈతొమ్మండుగురును విక్రమార్క మహారాజుయొక్క సభలో నవరత్నములని చెప్పబడుచు వచ్చిరి. ఇందు ధన్వంతరి వైధ్యశాస్త్ర పందితుడు. క్షపణకుడు డేగ్రంధము రచియించెనో తెలియదు. అమరమని పేరుతో దేశమందంతట మిక్కిలి ప్రఖ్యాతిజెందిననామలింగానుశాసన మీయమరసింహుడు రచించినదే. శెంకుడెవరో తెలియదు. భేతాళభట్టు రచించిన గ్రంధములు కానపడవు. ఘటకర్పరుడుప్రాకృతభాషలో గొన్ని గ్రంధములను రచించెను.