పుట:.Kalidasa-Charitra by chilakamarthi lakshminarasimham.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు

2

కాళిదాస చరిత్ర

చెప్పదగు ఇంక గాళిదాసునిమాట చెప్పనక్కఱలేదు. రఘువంశము, కుమారసంభవము, మేఘసందేశము నను మూడు కావ్యములందు, అభిజ్ఞానశాకుంతలము, విక్రమోర్వశీయము, మాళవికాగ్నిమిత్రము నను మూడు నాటకములను సంస్కృతములో రచించి మృతజీవుడయ్యను. వరాహమిహిరుడు జ్యోతిశ్శాస్త్రము నందు గొప్పపండితుడై బృహత్సంహిత, బృహజ్ఞాతకము నను రెండు మహాగ్రంధములను రచియించెను. వరరుచి వ్యాకరణశాస్త్రము వ్రాసెను. ఈతొమ్మండుగురు నిజముగా నవరత్నములే యనిచెప్పవచ్చును. ఈ నవరత్నహారములో నిజముగా గాళిదాసు నాయకమణి యని చెప్పవచ్చును. ఇతనికి వచ్చినంతపేరు మఱియెవ్వరికిని రాలేదు.శ్లోకములోనితడు విక్రమార్క సభయందున్నవాడని స్పష్టముగా జెప్పబడినను. ఆధారనగరము మేలిన భోజరాజునకును గాళిదాసునకును సంబధమెక్కున యుండినట్లు లోకములో ననేకకధలుకలవు. కాళిదాసు వంటి మహాకవి ప్రపంచమునలేడు. "ఉపమా కాళిదాసస్య" అనంగా నుపమాలంకారము కాళిదాసునదే యని యర్ధము. పోలికపోల్చిన గాళిదాసే పోల్చవలెను. ఆ విషయమున నాతడు నిరుపమానుదు. "కవికులగురువు కాలిదాసో విలాస" అని జయదేవ మహాత్ముడు చెప్పినాడు. అనగా గవితాకన్యకకు "కవికులగురువైన కాళిదాసే చక్కదనము" అని దీని యభిప్రాయము.

  శ్లో॥ పూరా కవినాంగణనా ప్రసంగే కనిస్టికాదిష్టిత కాలిదాసా,
       అద్యాపి తత్తుల్యకవేరభావాత్ అనామికా సార్ధవతి బభూవ॥

తాత్పర్యము: పూర్వకాలము కవులను లెక్కజూపుచు కాళిదాసునిపేరు కనిష్టముమీద (అనగ్సా జిటికెనవ్రేలిమీద) నిలచినది. అది మొదలుకొని నేటివఱకు వానితొ సమానుడైన కవీశ్వరుడు