పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

51

క్షమ, దయ మొదలగు సద్గుణము లంతరించిపోవును. ప్రావంచిక వ్యవహారములు జరుగు టసంభవమయిపోవును. వ్యవహారమందు గూడ నెవ్వడు దన పుత్ర మిత్ర భాతృకళత్రాదు లబద్ధమాడుటను గోరడుగదా! తమ మంత్రులు, సేనాపతులు అబద్ధమాడవలెనని యేప్రభుత్వమైన గోరుకొనునా? అంతియ కాదు. అబద్ధమాడిన మీదట ప్రతికూలత కన్పడి యా యనృతమాడిన వ్యక్తిని దండించుటకుఁ దగు ఏర్పాటు చేయబడును. న్యాయాధికారులు సాక్షులవలన సత్యభాషణము నాశించిననాడే న్యాయము జరుగగలదు. అసత్యము వలన నన్యాయము, అన్యాయమువలన జెడుశాసనము, జెడు శాసనము వలన నవ్యవస్థయు నేర్పడుట నిశ్చయము. ధర్మబుద్ధి యంతరించగనే లంచగొండితనము, బ్లాకు మార్కెటింగు వృద్ధిపొందుననుటలో సందియములేదు.

బజారులో బహిరంగముగ గేలను 1కి రు. 2-4-0 చొప్పున అమ్మబడు పెట్రోలు బ్లాకుమార్కెటులో రూ. 18/- ల చొప్పున అమ్మబడ నారంభించును. ధర్మముతోడ సంబంధమే లేనపుడు బ్లాకుమార్కెటింగు ఎట్లు అంతరించును?కష్టపడి పనిచేసినపుడు నెలకు రూ. 1000/- లు లేక రు. 2000/- లు వచ్చిన లంచగొండి తనము వలన లక్ష రెండులక్షల రూపాయలు మిగుల నారంభించును. ధర్మభయము లేనపుడు లంచగొండితనమెట్లు నశించును? ఈ కోడుబిల్లు కారణముగా మను, యాజ్ఞవల్క్య వశిష్ఠాదులచే నిర్మింపబడిన నియమము లుల్లంఘించబడగా, ప్రస్తుత నెహ్రూగారూ, అంబేద్కరు గారు నిర్మించిన