పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

హిందూకోడ్ బిల్ సమీక్ష

బంచుకొందుమని మాత్ర మొడంబడిక జేసుకొందురు." అని పల్కుట చాల యజ్ఞానమూలకముగ నున్నది. ఏలయన శాస్త్రసమ్మతమగు విధానములను బట్టియే సమాజముగాని రాష్ట్రముగాని, ప్రభుత్వములుగాని నడచుకొనవలసియున్నది. ఒక వ్యక్తినిబట్టికాని, సమూహమును బట్టికాని శాస్త్రవిధానములం దాటంకము కలుగరాదు. ఈ శాస్త్రవిరుద్ధ ప్రయత్నమును విడచి సామ్యవాదము నాధారముగ జేసుకొని సంపదలను పంచి పెట్టెద మందురా ! అప్పుడీచేసిన దాయభాగ వ్యవస్థయంతయు వ్యర్థమైపోవును. ఒకయెడ ధనముమీద భర్తకు సంపూర్ణాధికార మున్నదనియు, అతనికి సంపత్తు మీద సంపూర్ణముగ దానవిక్రయసత్తాధికారము లుండు ననియు జెప్పుచుండగ ద్వ్యాముష్యాయణ విధానముగ దత్తత చేసుకొనుట కధికార మెచటినుండి వచ్చును! బిల్లువారి యీపలుకుల కర్థమేమున్నది?

మితాక్షరాశాసనమున కాటంకము కలుగుటతోడనే కుటుంబము ఛిన్నభిన్నమగును. మృత్యుకరములమూలమున గూడ ప్రజలుకూడ చాల బాధపడిపోవుదురు. తల్లిదండ్రులలోను, సోదరులలోను ఐకమత్య విషయమెటులున్నను విడాకులచట్ట కారణముగ భార్యాభర్తలలో సుస్థిరసంబంధము చెడిపోవును. ఇక కుటుంబ జీవనము చాల కష్టమైపోవును. పిమ్మట నందఱు హెూటలు భోజనమునకు, హాస్పటలులో 'మృత్యువునకు అర్హులయిపోవుదురు. ధర్మము నశించుట మూలమున నీతికూడ నశించిపోవును. సత్యము, అహింస,