పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సామాన్య వివేచనము

23

పేరట బిల్లులను తయారు చేయుటకు వారికెట్టి యధికార మున్నది?

అంతమందు మఱల నానిషేధాత్మక పరిభాషనే యిచ్చినారు, ఏమనియనగా,"మహమ్మదీయుడుగాని, క్రైస్త వుడు కాని, పారసీకుడు కాని, యహూదుకాని కానివాడు కూడ హిందువుడనియే యనబడును." దీనిని బట్టి యందఱకు నొక పరిభాష యాధారము కలదనియు, హిందువులకే నిర్మాతల దృష్టిలో పెట్టి పరిభాషయు, నాధారము లేదనియు వ్యక్త మగుటలేదా ? వాస్తవమందీలజ్జావిహీన హిందువులు కూడ నొక హిందువులేనా ? హిందూకోడును నిర్మించుటకు వీరికధికార మేమయిన నుండవచ్చునా ? అంతమున 'నొకడు హిందూధర్మమునకు, జాతికి జెందనివాడయ్యు, హిందూ కోడు ద్వారా శాసింపబడినంత మాత్రమున నాతడు కూడ హిందువుడుగ దలపబడును' అను పరిభాష కూడ నీయబడి నది, ఇదియు నెక విచిత్రపరిభాషయే. ఇందుగల అవ్యాప్తి, అతివ్యాప్తి, అసంభవత, మున్నగు దోషములు వారికి గోచరించనేలేదు కాబోలును. బుఱ్ఱకు తట్టిన దేదియో వ్రాసి పెట్టి నటులున్నది. యథార్థమందు 'హిందూ లా ' మొదట హిందూధర్మశాస్త్రముల ననుసరించి రచింపబడినది. అందు చేతనే యా హిందూధర్మ శాస్త్రానుసారము శాసింపబడు వాడు హిందువు డనబడుచుండెడివాడు. కాని నేడో హిందూ కోడుబిలు హిందూ శాస్త్రములకు బూర్తిగా వ్యతిరిక్తముగ నడచినది కదా ! అట్టియెడ హిందూలా ప్రకారము