పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

హిందూకోడ్ బిల్ సమీక్ష

కైన ప్రమాణాధారముల యక్కఱ లేకయే ప్రభుత్వమునకు జెందినవారు, చెందనివారు నంగీకరించినంత మాత్రమున హిందుత్వము వచ్చివేయునా ?

ఇట్లే హిందూధర్మము నవలంబించువాడు హిందువు డనబడు ననినారు. కాని హిందూ ధర్మముయొక్క పరిభాషను కాని వాని ప్రమాణమునుగాని, ధర్మము నవలంబింపదగు పద్ధతినిగాని నిరూపించి యుండ లేదు. ఇందుమూలమున నీ కోడుబిల్లు అపూర్ణమైనదనియు, దీని నిర్మాతలు విశేషజ్ఞులు కారనియు దేటతెల్లమైనది. దీని ఫలిత మెటులుండుననగా నెవండైన దన తోచిన పట్టున నేను హిందూమతము ‘నవలంబించినాను' అనుటతోడనే హిందువులలో బరిగణింపబడ నారంభించును.ఈవిధముగగాని గొన్ని తరములనుండి యహిందువుడుగా వచ్చుచుండు వ్యక్తి కూడ నొక్క క్షణమందు హిందూధర్మము నవలంబించి, హిందువై యేహిందుకోటీశ్వరుని యాస్తికో యజమానియై మఱల నహిందువుడు కాగలడు.

కోడుబిల్లులో మున్ముందు 'ఎవండైన దనను హిందువు డని యనుకొనినను లేక ఘోషణ జేసినను హిందువుడనియే భావింపబడు ' నని కూడ జెప్పబడియున్నది. కాని యిపుడా యంశము తీసివేయబడినది. వాస్తవమందు శాస్త్రములను గాని ధర్మములనుగాని, జాతి వర్ణవిభేదమునుగాని యంగీక రింప నెంచుకొ ననివారల కీపటాటోప మంతయు నెందులకు ? వారు స్వయముగ నహిందువులు గదా ! హిందూధర్మము .