పుట:హిందూ కోడ్ బిల్ సమీక్ష - ప్రథమ భాగము.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సింహావలోకనము

7

పిమ్మట ననాది ప్రపంచమున కనాదిసృష్టికర్తయగు బరమేశ్వరుడు నాది లేనివాడే యనియు, నాతనివిజ్ఞానము. నావిజ్ఞానము తోడ ననువిద్ధములై యున్న శబ్దములగు వేదములు గూడ నాది లేనివే యనియు సిద్ధమగు చున్నది.

వేదములను 5 వేల సంవత్సరములకు బూర్వమందలి వని నిర్ణయింప బూనుకొనువారు అవలంబించు సిద్ధాంత మేమి యనగా - "ఏదేని ఘటన జరుగకముందు వ్రాయ బడదు. ఒక విషయము జరుగక ముందుగ నా విషయము, వ్రాయబడనేరదు. ఏదేని గ్రంథమందు హిట్లరు యొక్క నామమును జూచినవాడు ఆగ్రంథము హిట్లరు జన్మించిన తరువాతనే వ్రాయబడిన దనుకొనును. కాని పూర్వమందు వ్రాయబడినదని యనుకొనఁడు. ఇట్లే వేదము లందు గాననగు వేరు వేరు ఘటనలు, రాజులు, నగర, నదీ, పర్వత ధాన్యాదులు, జంతుగణము మున్నగువాని వర్ణనలను బట్టి యా విషయము లన్నియు జరిగిన పిమ్మటనే యా గ్రంథ ములు రచించబడి యుండును. ఈ దృష్టిచేత నాయా ఘట నల కాలనిర్ణయమునుబట్టి వేదముల కాలముకూడ నిర్ణయింప బడగలదు." కాని వేదముల విషయమున బూననగు ధారణ యిందుకు బూర్తిగా వ్యతిరిక్తమైనది. అనగా నిందు ఘటనలను బట్టి యాఖ్యానములు గాని, యితిహాసములుగాని వ్రాయబడవు. ఇతిహాసమును బట్టియే ఘటనలు జరుగుటయు వ్యక్తులు దయించుటయు, సంభవించును. అన్యభాషలన్నియు