పుట:హాస్యవల్లరి.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రా - కనకరత్న సంబంధం ఎల్లాఉంటుందని నువ్వు మళ్ళీ ఓకోన్కిస్కా హేని కనుక్కోవలిసిన పనేముంది పోదూ!

288

భద్రుడు - ఒక ఠావు తీసుగుని దానిమీద పంక్తికి అయిదారు అక్షరాలచొప్పున నాలుగైదు పంక్తులు రాసి మరోఠావు పుచ్చుగుని రాస్తుండగా స్వామిశాస్త్రి చూసి,

స్వా - ఏమిటి రాస్తున్నావ్, భద్రుడూ! మీ కుర్రాడి కాపీలకి ఒరవడా?

భ - కాదు మా మేనమామ కొడుక్కి ప్రైవేటు ఉత్తరం.

స్వా - ఈ ఉత్తరం ఒకటే మింగేటట్టుంది కొన్ని రీములు!

భ - ఏమో! సొమ్మంతా ఇల్లానే పోతోంది.

స్వా - లిపి అంతపెద్దపన్నాగా పుచ్చుగువ్నావేం!

భ - ఎంజెయ్యమన్నవ్? అవతల మా వాడికి బ్రహ్మ జెముడు, వీణ్ణి తగలెయ్యా, చచ్చిపోతున్నాను.

289

సూరన్న - వెంకన్నా! ఏం వారం ఈవేళా?

వెం - లక్షింవారం.

సూ - సుక్కురారంటగా!

వెం - ఎవరా అన్నదీ!

సూ - మా ముసలమ్మ,

వెం - ముసలమ్మలమాట ఎక్కడ నెగ్గుతుంది! ఇందాకా అయిన మీటింగులో ఇది ఓటుకిపెడితే, అధ్యక్షుడి చివరఓటుతో మెజారిటీ లక్షింవారం అనేశారు.

290

రాజు, లక్ష్మయ్య చేతులో గొడుగుచూసి,

రా - ఏరా లక్ష్మయ్య నీ గొడుగు పోయిందన్నావ్?

ల - అవున్రా కాలేజీలో గొడుగులు పెట్టుగునేచోట పెడితే ఎవడో మర్యాదగా తాంబూలం వేశాడు.

రా - మరి ఇదెవరిదీ? నీది కానటుంది?

ల - కాదు. కాకపోతేమాత్రం! ఎంజెయ్యనూ!


★ ★ ★

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

66

హాస్యవల్లరి