పుట:హాస్యవల్లరి.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



కాలక్షేపం

(TIT BITS)

రెండవ భాగం

ఇంగ్లీషుపాఠం మూలుగుతూ జోగుతూ కునికిపాట్లు పడుతూ చదువుతూన్న కొడుకుతో,

సవితితల్లి - పొగరుమోతా! క్రాపింగు అంటుగునేను! అదా చదువు!

కొడుకు (ఉలిక్కిపడి క్రాపింగు సర్దుకుని) - టి హెచ్ యి ఎం యే యన్ (అని ప్రారంభించగా, ఆవిడవెళ్ళి వాడితలకాయి గోణ్ణెట్టి కొట్టగా, కుర్రాడు ఏడుస్తూ, పుస్తకంకేసి చూస్తూ అందులో ఉన్నట్టు) ....... డబ్లుయూ ఐ డివోడబ్లుయూ ఎంయూయన్‌డియే! వై బీట్!

2

తగులడిపోతున్న ఒకకొంప ఆర్పిపెట్టడానికి కొందరు జాలి గుండెవాళ్ళూ, కొందరు వతనగా కొంపలారిపేవాళ్ళూ వచ్చింతరవాత ప్రేక్షకుల్లో ఒకడైన రాయుడుగారు, తన మిత్రుడు రంగకవిగారితో,

రా - రంగకవి గారూ! అల్లాచూస్తే కార్యంలేదు, రండి బింది పుచ్చుగోండి!

రం - ఉండవయ్యా! రేపు నేను హెచ్చుతగ్గుగా వర్ణన్లుచేస్తే మళ్లీనువ్వే తాటాకులు కడతావ్!

రా - అవీ ఉండవ్ కట్టడానికి! పెందరాళే రావయ్యా!

3

తెలుగుమేష్టరు - "తల్లిదండ్రులు” - ఏ సమాసం వనమయ్య!

వ - చాలా ప్రమాదం అండి. పచ్చిసమాసం.

తె - ఛీ! నోరుమూసుగో! పుంఢాకోర్! ఒక్కవరసగానే ఉంది నీనోరు!

కుసుమయ్య - (తన్ని అడక్కుండాను) ఒక్కవరసగా ఉంటా సమాసంలో పూర్వభాగం అండి! పరం బహు ఇది అశ్లీలంగా ఉంది.

4

కోటయ్య - ఒరేయ్! బ్రహ్మయ్య మరీపొడుగురా, తాడిలాగ! నీకూవాడికీ చెడిపెడీ అయింది టేమిటి?

బాపన్న - మరేరా! నేను! ఎగిరికొట్టాను, ఒక్క లెంపకాయ సాగదీసి! అది ఛళ్ళుమని వాడి పిర్రమీద తగిలిందిరా!

కో - మళ్ళీ కొట్టలేకపోయావ్ దవడ కందేటట్టూ!

బా - అనుకున్నా! యత్నించా! కా, వాడి పొడుగు చేతుల్తో నాగొంతిగ డబాయించి ఉంచాడేమో, నే కొట్టిన చరుపులన్నీ గాలిలో దూసుకుపోడమే!

5

ఒక కచేరీ ఇవతల సాయంత్రపువేళ ఒక సంసారి ఒకపెద్ద మనిషిని కలుసుగుని,

సం - ఏమన్నా అంటే మళ్ళీ గౌరవనీయుణ్ణి, పెద్ద సభ్యుణ్ణి అంటావు. అయిదుదాటింది. లోపలికివెళ్ళి నా విషయంలో మంత్రిగారికి సిఫార్సు చేస్తానని చెయ్యలేదుకాదూ?

భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1

67

హాస్యవల్లరి