మా - మీమేష్టరు మంచి తెలివిగలవాడై ఉండాలండి.
ఇంకో విద్యార్థి - కాదు. వీళ్ళనాన్న తెలివిగలవాడు. ఈన్ని సరియైన మేష్టరుదగ్గిర పారేశాడు.
రం - మామేష్టరు అడ్డమైన అనర్హుణ్ణి చేర్చుకోడం నేనెరుగను. పాఠంలో పడదాం.
97
యాభైని నాలెగెట్టి గుణించమని, అయిదు నిమిషాలు ఊరుకుని, ఇనస్పెక్టరు ఒక కుర్రవాణ్ణి,
ఇ - నీ పేరేమిటమ్మా.
కు - తిలక్ అండి.
ఇ - బాగుంది, నీకు ఆన్సరు ఏంవచ్చింది?
కు - (గుతకలువేస్తూ) మరేమోనండీ, రొండండి.
ఇ - యాభైని నాలుగెట్టి గుడిస్తే యాభైకంటె ఎక్కువొస్తుందా, తక్కువా ?
కు - ఎక్కువేనండి.
ఇ - మరి రొండంటావే ?
కు - చివర సున్నలుంటే కొట్టెయ్యచ్చని మా అన్నయ్యతో వాళ్ల ప్రైవేటుగారు చెప్తే విన్నానండి..
98
తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్లో,
ఆచారి - టిక్కెట్లిచ్చే గుమస్తా మీరేటయ్యా ?
గు - మరేనండి,
ఆ - ఇంకా ఆలస్యమేమిటి.
గు - లేదండి.
ఆ - అయితే, రాజమండ్రీ గోదావరికి టిక్కెట్టు ఎంత కమ్ముతున్నారండీ?
గు - ఏడణాలకాని.
ఆ - పావలా అర్థణాకిస్తారా ఇంకా ఏమన్నా బేరముందా?
గు - అవతలకిపో బ్రూట్!
ఆ - ఛీ! ఛీ! ఇక్కడన్నీ ప్రియమే. బజార్లోనే నయం!
99
షాపుమీదికీ వెళ్లి కోటుగుడ్డలరకాలు చూస్తూ షాహుకారు కొంతెడంగా ఉండగా, మెల్లిగా,
బుచ్చిరాజు - ఒరేయి, సరవారావు! ఈ గుడ్డ గజం ఎంతో?
స - బహుశా గజం మూడడుగులు అయిఉంటుంది! చాలా నాణెం సరుకుస్మీ.
బు - మరే. మన్నేటట్టే ఉంది. కాని నేను గజం ముప్పై ఆరు అంగుళాలు అని ఆలోచిస్తున్నా ఇంకా! తప్పు తప్పు!
స - అడ్డమా! ఇహ ఇల్లాంటి తప్పుడాలోచన్లు మానుకో.
100
ఇంటిల్లపాతీ తాగుబోతులైన ఒక నీచపు సంసారంలో,
చిన్నవాడు - ఓలమ్మోయ్! నీలట్రాహే, నింతెగెయ్యా!
పెద్దవాడు - లమ్మనెందుకురా తిడతావ్, తొత్తుకొడకా!
భమిడిపాటి కామేశ్వరరావు రచనలు - 1
22
హాస్యవల్లరి