పుట:హరివంశము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

హరివంశము


కు నొకటి మేలు సేయఁగఁ దగున్ గులిశాహతి[1]చేత నైనయ
త్తనుశకలంబు [2]లన్నియు వధం బొనరింపక కావు మింతటన్.

90


వ.

ఈ నలువదితొమ్మిదియును దేవత లై నీవు మా రుద యనుట కారణంబుగా
మారుతు లనం బరగి దేవాసురసమరంబులందు నీకుం జేదో డై [3]నడువవలయు.
దీనికి నొడంబడు మనియె. నతం డవ్విధంబునకుం బ్రియంబు నొందె. నిది సకల
భూతసంభవప్రకారంబు.

91


క.

ఈ సృష్టివిధం బెఱిఁగిన, భాసురపుణ్యుండు సకలభయములవలనన్
బాసియు నతులైశ్వర్య, శ్రీసౌఖ్యము లొందు మోక్షసిద్ధియుఁ గాంచున్.

92


వ.

విను మివ్విధంబునం గలిగిన భూతవిశేషంబులకు నజుండు ప్రత్యేకంబ యధి
కారులం గలిగించి యభిషేకం బొనర్చె. నంతయు వివరించెద.

93


సీ.

పృథుఁడు భూపతులకుఁ బెద్దవాఁడై యుర్వి యంచితనీతిఁ బాలించువాఁడు
ద్విజతారకాతరువ్తజయజ్ఞములకు నుజ్జ్వలతపంబుల కోషధులకు సోముఁ
డర్థసంపదలకు [4]నంబుధివితతికి రాజన్యులకును వైశ్రవణుఁ డొడయఁ
డఖిలభూతముల ననంతపిశాచసంచయముల శాసించుఁ జంద్రధరుఁడు


తే.

విష్ణుఁ డాదిత్యులకు వసువితతి కగ్ని, జలములకుఁ బాశపాణి వేల్పులకు నింద్రుఁ
డసురకోటికిఁ బ్రహ్లాదుఁ డంతకుండు, పితృసమూహంబునకు నధిపతులు వరుస.

94


క.

నాగులకు వాసుకియుఁ బెఱ, భోగులకుం దక్షకుఁడుఁ బ్రభులు పక్షులకున్
నాగాంతకుండు మనుజవ, రా! గంధర్వులకుఁ జిత్రరథుఁడును నొడయుల్.

95


క.

కరులకు నైరావతమును, హరులకు నుచ్చైశ్శ్రవంబు నవనీస్థలిపై
నరులకు నృపతియు హిమగిరి, గిరులకు నేఱుల కుదధియుఁ గీర్తిత[5]ధర్తల్.

96


వ.

ఇది యాదిగా నాదిసర్గంబునం బరమేష్ఠి నియమించిన యాధిపత్యంబు లట్లు నిశ్చ
యించి యాజగద్ధాత ధాత్రియంతయు నాలుగు చెఱంగులుగా నేర్పఱిచి యందు
బూర్వదిక్కున విరాట్పుత్రుం డగు[6]వైరాజును దక్షిణదిక్కునం గర్దమపుత్రుం
డగుశంఖపదుండునుం బశ్చిమదిక్కున రజఃపుత్రుం డగుకేతుమంతుండును నుత్త
రపుదిక్కునం బర్జన్యపుత్రుం డగుహిరణ్యరోముండును బరిరక్షకులుగాఁ
బ్రతిష్ఠించె. నన్నలువురు రాజులును మధ్యమభూమిశ్వరుం డగుపృథుండు
తమకు ననుశాసకుండుగా భాసిల్లి. రివ్విధంబునం బూర్వులచేత నీయుర్వి సర్వ
పర్వతద్వీపసాగరసమేతయై యనుభూతిం బొందె. నంతం జాక్షుషమన్వంతరానంత
రంబున వనజభవుండు వైవస్వతమనువునకు సమగ్రసామ్రాజ్యం బొసంగె ననిన
విని జనమేజయుండు.

97
  1. జేసియైన
  2. లిన్నియు
  3. బంటులు గావలయు
  4. యక్షరాక్షసులకు
  5. భర్తల్
  6. సుధన్వుని