పుట:హరివంశము.pdf/51

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వభాగము - ఆ ౧

3


వ్యహారంబులవలన నిశ్శంకంబు లై బిరుదాంకంబులు ప్రవర్తిల్ల విలసిల్లు వేమజనేశ్వరుండు.

11


క.

[1]సకలకవివర్ణనీయుఁడు, సకలనృపతిపూజ్యుఁ డతని[2]సంపద్విభవం
బకలంక మనాతంకము, సకలజగన్మంగళప్రసంగము పేర్మిన్.

12


సీ.

కేయూరకంకణాం[3]కితపరాక్రమవితరణములు [4]బాహుభూషణత నొంద
ననుకూలగృహిణిచాడ్పున నృపశ్రీ యెందుఁ గదలక సకలసౌఖ్యముల నొసఁగ
నమృతసేవనము చందమున [5]నుత్తమధర్మతాత్పర్య మధికమోదంబుఁ బెనుపఁ
గరతలామలకవిఖ్యాతి నాతతనీతిగరిమంబు నిజవివేకమున వెలయ


తే.

జాహ్నవీప్రవాహముభంగిఁ జరిత మఖిల, భువనపావనపరిపూర్తిఁ బొలుపు మిగులఁ
బరఁగు వేమక్షమానాథుపాటినృపులు, గలరె యెవ్వారు ధారుణీతలమునందు.

13


ఉ.

వాలి మదోద్ధతారిజయవాంఛ నుదగ్రభుజుండు వేమభూ
పాలుఁ డనంతసైన్యభయబంధురలీలఁ గడంగి యెద్దెసన్
గ్రాలఁగఁ దీవ్రఘోట[6]ఖురఘట్టన మొందనిచోటు లేదు వా
చాల[7]విలోలవీచిశతసంకులసాగరవేష్టితక్షితిన్.

14


శా.

కాంతారంబులు దూఱి శైలములు ప్రాఁకన్ బాఱి [8]యంభోధితో
యాంతర్భూముల దాఁటి యెన్నఁడు[9]ను భీత్యంతంబెదం గాన క
త్యంతక్లేశము నొందుచుండుదురు వేమాధీశుధాటిం బరి
భ్రాంతిత్యక్తకళత్రపుత్రసుహృదాప్తశ్రీకులై శాత్రవుల్.

15


మ.

గజతాఘోటకహాటకప్రముఖముల్ గప్పంబు లొప్పించుచున్
విజితారాతులు మ్రగ్గ దిక్కుల హిమానీకాశ[10]నీకాశలై
నిజకీర్తుల్ నిగుడంగ లక్ష్మి కతులోన్మేషంబు పోషించె న
క్కజమై వేమనరేంద్రుపేర్మి జగదాకల్పంబు గా కల్పమే.

16


క.

ఘనుఁడు పరాక్రమసంభృత, ధనకోటికి ఫలము పాత్రదానమ యని యెం
దును బహుపురాణముఖముల, వినుచుండుటఁ జేసి యధికవిశ్వాసమునన్.

17


వ.

ఇష్టాపూర్తరూపం బగు క్రియాకలాపంబు నిజకర్తవ్యానురూపంబుగాఁ దొడంగి.

18


సీ.

అగ్రహారములు విద్యాతపోవృద్ధవిప్రుల కిచ్చి యజ్ఞ[11]కర్తలుగఁ బనిచెఁ
గొమరారఁ జెఱువులు గుళ్లు ప్రతిష్ఠించి లోకసంభావ్యంబులుగ నొనర్చె
నిధులు నల్లిండ్లును నిలిపెఁ దోఁటలు సత్రములు [12]చలిపందిళ్లు వెలయఁ బెట్టె
హేమాద్రిపరికీర్తితామితవ్రతదాననివహంబు లన్నియు నిర్వహించెఁ

 1. సకలవిధవర్ణనీయుఁడు
 2. సద్గుణనివహం
 3. కృతి
 4. బహుళ
 5. ననుత్తమ
 6. ఖురఖండన
 7. విశాలవీచిశరజాలమునక్కుల; విశాలవీచిశరసంకుల
 8. అంభోధితాయాంతర్భూములు
 9. విపత్యబ్ధిం జెడం
 10. రాకేశు
 11. భర్తలుగ వనిచె
 12. చలివిందరల్