పుట:హరివంశము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

హరివంశము


సందర్భాంచితు భారతాగమకథాసద్భావు లోకత్రయా
నందప్రాప్తికరుం బరాశరసుతున్ సర్వజ్ఞుఁ గీర్తించెదన్.

6


మ.

చతురోద్యన్మతి వాతపోతకమహాసాంయాత్రికుండై తగన్
జతురామ్నాయపయోధుల న్మెలఁగి భాస్వద్రత్నముల్ రామస
న్నుతిరూపంబుగఁ గూర్చి విశ్వజగమున్ భూషించె నేధన్యుఁ డా
ప్రతిముఖ్యుండు ప్రసన్నుఁ డయ్యెడుఁ గృపన్ వాల్మీకి మా కెప్పుడున్.

7


ఉ.

ఉన్నతగోత్రసంభవము నూర్జితసత్త్వము భద్రజాతిసం
పన్నము నుద్ధతాన్యపరిభావిమదోత్కటము న్నరేంద్రపూ
జోన్నయనోచితంబు నయి యొప్పెడు నన్నయభట్టకుంజరం
బెన్న నిరంకుశోక్తిగతి నెందును గ్రాలుట ప్రస్తుతించెదన్.

8


మ.

తనకావించిన సృష్టి తక్కొరులచేతం గాదు నా [1]నేముఖం
బున దాఁ బల్కినపల్కు లాగమములై పొల్పొందు నా [2]వాణి భ
ర్తను (?) నీతం డొకరుండ నాఁ జనుమహత్త్వాప్తిన్ గవిబ్రహ్మ నా
వినుతింతున్ గవితిక్కయజ్వ నఖిలోర్వీదేవతాభ్యర్చితున్.

9


ఉ.

కామవిలోభకస్పృహల గర్వపరంకర [3]క్రందువాసి హృ
త్తామరసస్థితుం డగు సదాశివుఁ గాంచి తదేకచింత చిం
తామణియై తలిర్పఁ దుదిదాఁకినయున్నతిఁ గన్న శంకర
స్వామి గురుండు మాతలఁపు సర్వముఁ దానయి యుండుఁ గావుతన్.

10


వ.

అని యిట్లు పూజ్యపూజాతత్పరుండ నైన నాకు నభీష్టార్థదాతయై యవదాత చరితంబున నఖిలజనరంజనం బొనర్చుటం జేసి రాజశబ్దంబునకు భాజనం బగుచుఁ
దేజోవిలాసైకనిత్యుండు పల్లవాదిత్యుం డనియును నుదాత్తపౌరుషోద్ధతుండు జగనొబ్బగండం డనియును సంగతానేకనరపాలనపరిపాలనశీలుం డంగరక్షాపాలుం డనియును [4]సకలకళాధికృతవిసృమరకేలివిధేయుండు కేళాధిరాయఁడనియును ననుభూతాద్భుతసమరవిజయుండు సంగ్రామధనంజయుం డనియును [5] అఖిలశత్రువిదారణప్రతిజ్ఞాపూరణోద్దాముండు భుజబలభీముం డనియును నసాధ్యసాధకవీరవ్రతనిర్వహణపరాయణుండు వీరనారాయణుం డనియును దురవగాహరిపువ్యూహవ్యపోహాభీలుండు గుజ్జరిదళ[6]విపాలుం డనియు
నాశ్రితరక్షణవ్యవసితదయాలోలుండు [7]జగరక్షపాలుం డనియును [8]జతుర్విధ దుర్గదారణవిహారోదారుండు చంచుమలచూఱకారుం డనియును బ్రతిభటవేదండఖండనప్రచండుండు మండలీకరగండం డనియును బహుప్రకారంబుల వీర

  1. నాముఖంబున
  2. వాణిన త్తను
  3. పొందు
  4. సకలకథావిశ్రుత
  5. దుశ్శీలశత్రు
  6. విభాలు
  7. జగద్రక్షపాలుండు
  8. చతుర్విధదుర్గవిదళనోదారుండు