పుట:హరివంశము.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

398

హరివంశము

క. వేడుకకుం దలపడి పృథ, సూడఁగఁ బోరాడి వాయుసుతు నోడించెన్
     గ్రీడిఁ బరాజితుఁ జేసెం, గ్రీడాహితబాహుశక్తిఁ గేశవుఁ డధిపా.259
తే. [1]బభ్రుకొఱకునైై సౌవీరపతి జయించి, తెచ్చెఁ దత్పుత్రి నఖిలపార్థివులుఁ గూడి
     వేణుధారి తన్ దొడరిన విక్రమించి, శౌరి యందఱ నిర్జించి చంపె నతని.260
వ. మఱియఁ గరూషాధిపతి యైనదంతవక్త్రు దక్షిణాపథంబున వధియించెఁ బర్వత
     సహస్ర్రంబులు చక్రంబున భేదించి ద్రుముసేనుం బరిమార్చె నిరావతీనగరంబు
     వొదివి గోపతితాలకేతు లనుభూపతులఁ దునిమె యక్షప్రపతనం బనునెలవునం
     బ్రబలబలాన్వితు లైన నిమిహంసు లనునృపులం గూల్చె వజ్రుండు శైబ్యుండు
     శతధన్వుం డుగ్రసేనుండు ననురాజులం ద్రుంచెఁ గంసామాత్యులం బృథుం డను
    దైత్యుఁ దత్పుత్రుం డసిరోముతోఁగూడ సమయించె మానుషరూపధరు విరూ
     పాభిధానుం దానవు నైరావణం బనుదంతిసహితంబుగా వ్రచ్చె హిమశైైలసంచారు
     లై లోకాపకారు లగుమైందద్వివిదు లనువానరులం దెగటార్చె శోణపురం
     బునం బురవైరిచేత రక్షితుం డైనబలిసూను బాణుం బ్రాణమాత్రావశిష్టుం
     జేసి బాహుసహస్రచ్ఛేదనంబునఁ బోవ విడిచెఁ బావకుం జయించి నిస్తేజుం
     గావించె సాగరంబు గలంచి చొచ్చి సవరివారు వరుణుం దిరస్కరించె నివి త్రివిక్రము
     విక్రమంబులు బాల్యంబునఁ బూతనాఘాతంబు మొదలుగాఁ గంసధ్వంసనంబు
     తుదగా నొనర్చిన పను లెత్తెఱంగులో, పిదప జరాసంధవిరోధంబునం జేసిన చేఁత లే
     విధంబులో కాలయవనసంహరణంబు ద్వారావతీకరణంబు రుక్మిప్రహరణంబు నరక
     నిపాతనంబును పౌండ్రనిపాతనంబు లోనుగా నిర్వహించిన సర్వకార్యంబు
     లెబ్భంగులో గాండీవిచేత ఖాండవదహనంబు సేయించుట భీమసేనుచేత [2]జరా
     సంధుం జంపించుట యతనిచెఱ నున్ననరనాథుల విడిపించుట యపరాధశతంబు
     నిండిన శిశుపాలు జముపాలు వఱచుట సౌంభవిభుం పీడించుట పాండవసహాయుం
     డై సర్వక్షత్రంబు నిశ్శేషంబుగా నొనర్చుట యేచందంబులో యూహింపుము.261
క. తనమేనయత్త గొంతికిఁ, బ్రమదంబునం దత్తనూజపంచకమును గ
     య్యముల బ్రతికింతు ననియె, న్గమలాక్షుఁడు పలికినట్ల కథ యేతెంచెన్‌.262
క. మీతండి ద్రౌణిబాణవి, ఘాతుండై పుట్టుటయును గంసారికృపా
     స్ఫీత యగుదృష్టి నాతని, కే[3]తెరువున నిచ్చె జీవ మెఱుఁగవె యనఘా.263
వ. [4]ధర్మవిద్వేషులు ధర్మవిప్లావకులు నగుపాపాత్ముల నెల్లను మడియించుట యద్దేవ
     దేవదివ్యలీల లిట్టిమహిమ లెన్ని పేర్కొనిన నన్నియ కల వవి యెల్లను [5]ముని
     వర్ణితంబులు త్రిభువనోద్గతంబులు నఖిలదురితోత్తారకంబులుఁ బ్రచురకళ్యాణ
     కారణంబులు నైయుండు నని వైశంపాయనుండు వర్ణించినచందం బానందని
     ష్యందసుందరం బై యొప్పుచుండ.264

  1. బభ్రుకొడుకైన
  2. మగధనాథుం
  3. తెఱఁగున
  4. బ్రహ్మ
  5. వ్యాస