పుట:హరివంశము.pdf/445

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - ఆ. 6.

397

క. కాశీశుసుతపురోహిత, నాశని యగుకృత్య మరలినం దోడన యా
     క్రోశార్త యైనదానిం, గేశవసాధనము వెనుదగిలెఁ దీవ్రగతిన్.249
వ. అదియునుం గాశీపురంబునకుం జనఁ దదార్తధ్యానం బనతిదూరంబున వీతేరం
     బౌరులు గలంగిరి రాజసేనాపతు లిది యేమి యేమియో యనుచు సకలసైన్యం
     బులం బన్ని యద్దెసకు నడచి.250
తే. కనిరి మిన్నును నేలయు ననలశిఖలఁ, బొదివి శతకోటిసంఖ్యదంభోళిశతము
     లొక్కప్రోవయి చనుదెంచునోజఁ గృత్యు, ననుగమించు వైకుంఠుదివ్యాయుధంబు.251
క. కనుకని తమతమకైదువు, లనువుగఁ బచరించుకొనుచు నభిముఖులై యం
     తన తత్తేజోహత[1]ద, ర్శను లగుటం దల్లడిల్లి క్రమ్మఱిరి వెసన్‌.252
వ. ఇవ్విధంబున నందఱు విఱిగి పురంబు సొచ్చుటయుఁ గృత్యయు వెనుకన చొచ్చె
     నమ్మహాచక్రంబు నవ్వీటిపైఁ బడి కృత్యాసహితంబుగాఁ బార్థివామాత్యభృత్య
     పురోహితబాంధవపౌరవారణరథతురంగభాండాగారగోష్టగృహంబులతోడ
     నున్నతహర్మ్యప్రాసాదసభాచయచత్వరోవశోభిత యగునగరి యంతయు నిమిషం
     బున నీఱుగాఁ జేసె నట్లు దేవాసురాదులకుం దేఱిచూడరాని యాదివ్యనివాసం
     బాసురచరితులకతంబున నుపహతంబు గావించి సర్వభూతదుర్దర్శనం బైనసుదర్శ
     నంబు విష్ణుసమీపంబునకుం జనుదెంచె నని వైశంపాయనుండు వివరించిన పౌండ్ర
     వధప్రకారంబు విని జనమేజయుండు విస్మయప్రమదరసనిమగ్నం బగుమనంబుతో
     మరియు నతని కి ట్లనియె.253
క. ఎంతెంత వింటి మాత్మకు, నంతంతయ ప్రియము సేసె హరిచరితము ల
     త్యంతవిచిత్రములు నతి, శాంతము లద్భుతము లధికకల్యాణంబుల్‌.254
తే. తనియ దింకను జిత్తంబు మునివరేణ్య యమృతసారంబు వీనులయందుఁ గ్రోల్పు
     మనిన నతం డానరేంద్రున కాదరమున, నిట్లనియె వాక్యసౌభాగ్య మింపు మిగుల.255
క. నిర్మలయశుండు జనార్టను, కర్మము లమితములు సెప్పఁగా నొప్పువచో
     నిర్మితు లెక్కడఁ గల రతి, ధార్మికసంపూజ్య చెప్పెదను గొన్ని దగన్‌.256
వ. అవియును సవిస్తరంబుగా నుదాహరింప ననేకకాలంబు వలసియుండుఁ బరిమిత
     భాషణంబుల నుదాహరించెద నాకర్ణింపుము.257
సీ. ద్వారకాపురమున వసియించి [2]యవ్వాసుదేవుండు గ్రమమునఁ దేజ మెసఁగ
     సకలనరేంద్రరాజ్యశ్రీలు దన్నుఁ జేరడునుపాయముతోడికడిమిఁ బేర్చి
     పాండ్యులఁ గేకయపతులఁ గాళింగుల నంగవంగేశుల నాహవములఁ
     దగిలి యొక్కొకనిమిత్తంబున భంగించెఁ బెక్కండ్రు నృపతుల నుక్కుమడఁచె
తే. [3]రాజితాన్వయగాంధారరాజకన్యఁ, గోరి గ్రహియించె గురునస్త్రగురునికొడుకుఁ
     గృపునిఁ గర్ణునిఁ గురుపతి గెలిచి భీష్ము, ఘనతఁ గార్యాంతరమ్ములఁ గడఁగి గెలిచె.258

  1. దశ, ఘ
  2. వాసుదేవుఁడు ప్రశస్తప్రభావుఁడు గ్రమమున
  3. ఆ. రాజితస్వయంవరమున గాంధారక, న్యకఁ బరిగ్రహించె నస్త్రగురుని కొడుకు గృపునిఁ గర్ణు గురుపతిభీష్ముఁ గార్యాంతరములఁ దొడరి, యభిభవించె.