పుట:హరివంశము.pdf/436

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

388

హరివంశము

క. నను నెఱుఁగఁడె నానామము, దన కలవడునే తలంపఁదగదే దీని
     న్వనితాహంతకుఁ బశువిశ, సనకారికి నిట్టిపేరు సదృశమె యరయన్.154
ఉ. నాచెలికాని నాధరణినందనుఁ జంపినవాఁడిఁ గాన బా
     హాచతురుండ నై యతని నాజిమొన న్వధియింప వచ్చితిన్
     వే చనుచెంచి తాను నను [1]వీఁక నెదుర్చుట యొప్పు నీదెస
     న్నీచము నాకు సంగరము నీవు దొలంగఁగఁ బొమ్ము నెమ్మదిన్‌.155
మ. అటుగా కించుక నిల్వనోపిన మదీయాఖండకోదండ ము
     ద్భటమై యీనెడు బాణసంతతులచందంబు దగం జూడు మం
     తటిలో నీపని సక్కనయ్యెడు నపేతప్రాణుఁ గావింతు మి
     క్కుటపుంగ్రొ వ్వణఁగంగఁ గుందు నెద మీ[2]గోపాలుఁడున్ బాలిశా.156
వ. ఇచ్చోటి పసులవ్రేఁ గంతయు నీతలన యెత్తి ఆానుఁ కైలాసపర్వతంబునకుం
     బోయె నని వింటి మాకృష్ణుండు వచ్చినయప్పటికిం దగిన కర్జంబు సూచికొనియె
     దము నీకు పాదునిలిచి మీయేలికకుం బ్రియంబుగాఁ జచ్చుటయు ధర్మంబకాదె
     యనిన శైనేయుం డట్టహాసంబు సేసి యతని కి ట్లనియె.157
చ. హరిఁ బరమేశ్వ[3]రేశ్వరు సమస్తజగత్ప్రియుఁ గూడువల్కుదు
     ర్నరుఁడవు నీదుజిహ్వ పలువ్రయ్యలువాయదు నోరఁ బెల్లుగాఁ
     దొరఁగవు తోఁకపుర్వు లెడఁ దూఱ(ల)దు ప్రాణము సూడుమా మహో
     ద్ధురమయి చేరె మృత్యు విటుత్రుళ్ళకు మొప్పదు సెప్పెదం దుదిన్‌.158
తే. ఆదిదేవునిపేరు చిహ్నములు మోచి, నంతటనె యాతనికిఁ దుల్యుఁ డండ్రె నిన్ను
     సింహచర్మంబు దొడిగినఁ జెనఁటికుక్క, గంధగజగంధమునకును గలదె నిలువ.159
క. ఒక్కఁడ సర్వగతుండై, యొక్కుడుక్రియ వాసుదేవుఁ డితఁ డని పెద్దల్‌
     మ్రొక్కఁగ నుండుజనార్దనుఁ, డక్కరణి యనన్య మెఱుఁగ వైతి దురాత్మా.160
మ. భువనస్వామికి ద్రోహి వైనకుమతిం బోనీక ని న్నిప్డు గ్‌
     ష్టవిధిం బెట్టి తిల్వపృమాణశకలస్రస్తాంగునిం జేసి మ
     జ్జవసామిశ్రభవత్తనూపలలముల్‌ సాలంగ నేఁ డిచ్చటన్
     నవభంగిన్ బహుయాతుధానతతికి [4]న్వడ్డించు నాబాణముల్‌.161
తే. ఇంతలో శౌరి చనుదెంచెనేనిఁ దీవ్ర, భూరిదివ్యాస్త్రచయములఁ బొదివి పట్టి
     కట్టి యొప్పింపఁ బశువవై కంసదమను, ఖడ్డధారకు లోను గాఁ గలవు నీవు
వ. అని యివ్విధంబున నన్యోన్యంబు పరుషంబులు వలికి తలపడినం గయ్యం బ
     య్యిరువురకు ఘోరం బయ్యె నందు.163
క. తెగనిండఁ దిగిచి యొకయా, శుగ మప్పౌండ్రకునియురము సొనిపెఁ దొలుతనా
     నగధరుతమ్ముఁడు దానం, బగతుఁడు వడవడవణంకి భ్రమగొని తిరుగన్‌.164

  1. నన్నెదిర్చిన
  2. గోపుండు గోపాలకా
  3. రుంబ్రభు
  4. న్నందించు