పుట:హరివంశము.pdf/437

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్తరభాగము - అ. 6.

389

క. ముక్కున నోరను నెత్తురు, గ్రక్కున వెడలంగ ధైర్యకఠినుఁ డగుట దా
     నొక్కింత సైచి యంతన, నెక్కొను తెలివునఁ బ్రహాసనిర్భరమతి యై.165
తే. తొమ్మిదియు నైదు క్రొవ్వాఁడితూవు లయ్య, దూద్వహునిమీఁద నేసి వేఱొక్కవలుద
     నారసంబున ఫాలంబు నాటుటయును, మూర్ఛవోయి రథంబుపై మ్రొగ్గె నతఁడు.166
వ. ఆలోనఁ బౌండ్రుండు నిరువదే నమ్ముల నతని సారథి నొప్పించి రథ్యంబుల
     నాలుగింటిని నాలుగు శరంబుల స్రుక్కించి సింహనాదంబు సేసె నంతటం దెలిసి
     శినివరుండు.167
క. తూఁగాడుసూతుని సముద్వేగంబున వడఁకు రథ్యవితతిం గని [1]రో
     షాగమ[2]కలితుం డై ఫణి, భోగనిభం బైనచాపమున నొకశరమున్‌.168
వ. వజ్రోపమం బైన దాని సంధించి బెట్టిదంబుగాం దిగిచి పగతు నురంబు వ్ర్రయ్య
     నేసి మూర్ఛ ముంచి.169
తే. పడగతోడన తునుమాడి పటుహయములఁ, జంపి సారథిం బరిమార్చి సకలనభము
     బూరటిల్లంగ సింగంబుపోల్కిఁ బెలుచఁ, బొరి [3]నుదీర్ణగర్జాపరిస్ఫూర్తిఁ జెలఁగె.170
వ. పౌండ్రపతియును నాలోనన తెలిసి హతరథ్యం బగు రథంబు డిగ్గి సాత్యకి రథంబు
     గుఱ్ఱంబులం బడనేసి సూతు సమయించి రథావయనంబు లన్నియు ననేకసహస్ర
     సంఖ్యంబు లగు విశిఖంబులం బొడివొడి సేసె నివ్విధంబున.171
క. ఇరువురును విరథులయి యొం, డొరువుల చాపములు నఱికి యొక్కట పటుతో
     మరశక్తిముఖాయుధములఁ, జిరముగఁ బోరిరి చలంబుఁ జేవయు నలరన్‌.172
వ. తదనంతరంబ గదాహస్తు లై తాఁకి యభ్యస్తంబు లగు సమస్తకళావిస్ఫారంబులు
     ప్రశస్తంబులుగాఁ బెద్దయుం బ్రొద్దు పెనంగి యన్యోన్యఘాతంబుల నుద్భూతం
     బైన రక్తంబున సిక్తంబు లై ప్రతీకంబులు వసంతాశోకంబులకు సదృశంబు లై
     యసదృశోల్లాసంబున నుద్భాసిల్లం గొండొకతడవునకు గదలు మిధోహననంబు
     లైన విడిచి పిడికిళ్లకుం జొచ్చి పెచ్చుపెరిగి పొదుచునప్పటి చప్పుళ్లు సర్వభూత
     భీతిజననచండంబు లై యొండొండ నొదలఁ దలంబుల వ్రేసియుంఁ బెడచేతుల
     నడిచియుఁ గూర్పరాహతు లొనర్చియు జానువుల నొంచియుఁ గేశాకర్షణనఖ
     విఖండనప్రముఖంబులం దొడరియుఁ బోరి తమపోరు సూచువారు తమ్ము
     నుద్దేశించి యీసాత్యకి యీపౌండ్రుం బొరిగొనక యేల విడుచు నీపౌండ్రుండు
     సాత్యకిని మడియింపక యుడుగ నేరండు. వీరిద్దఱు నొక్కలావువారు గాన
     యొండొరువులచేతం జచ్చి వీరస్వర్గంబు నొందుదు రింతియ కాని యలంతుల
     నిలువ రిట్టశౌర్యం బిట్టిధైర్యం బిట్టిచలం బెట్టిబలం బెచ్చోటఁ జూడ మెయ్యెడల
     విన మెన్నఁడు నెఱుంగ మనుచుం బ్రశంసింప నకంపితప్రకారు లై తాఁకి రయ్యు

  1. కోప
  2. కలుషితుఁ డై
  3. నినుద్దీర్ణగజ