పుట:హరివంశము.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

274

హరివంశము

క. విని తనవారల కెల్లను, ఘనభుజుఁ డెఱిఁగించి నేఁడ కదలుద మని శో
     భన మగుదివసం బిది యని, యనుపమకల్యాణవిధిసమాచారముతోన్.108
వ. సకుటుంబు లగువృష్ణ్యంధకవీరులం దోడ్కొని సమస్తవస్తుసంపదలతోడ నడువ
     ననంతదంతిరథతురంగబహులంబుగ బలంబుల నాయితంబు సేసికొని తానును
     బలదేవుండును వసుదేవు నుగ్రసేనుని బురస్కరించుకొని పురంబు నిర్గమించి
     పశ్చిమాభిముఖు లై ప్రతిదివసప్రయాణంబుల నరిగి పున్నాగనాగకేసరనాగల
     తాక్రముకనారికేళకేతకీప్రముఖవనషండమండితం బగుసాగరానూపప్రదేశంబు
     చేరి యందు సికతామలమృద్భూషితం బగుభూభాగంబు గని.109
సీ. ఇది వాహనములకు హిత మిది జనులకు నాయురారోగ్యవృద్ధ్యావహంబు
     మధురమనోజ్ఞనిర్మలతోయసంపన్న మిది సర్వతరులతాభ్యుదయభూమి
     యిది యిది మును ద్రోణుఁ డేకలవ్యునిచేత నర్చన గైకొన్నయన్నివాస
     మిది మందరమువకు నెన యైనరైవతకాద్రి చేరువను నొ ప్పమరునట్టి
తీ. [1]దనుచుఁ దద్విశేషంబు లత్యాదరమున
     నర్హకోటికిఁ జెప్పుచు నంబుజాక్షుఁ
     డంతపట్టు వారలఁ దగ నచటు విడియఁ
     బనిచెఁ దగుముహూర్తంబున మన మెలర్ప.110
వ. ద్వారవతినామకం బగుపురం బతిమనోహరంబుగా నిర్మించి పురవాస్తవ్యులు
     బంధుమిత్రమంత్రిసేనాపతులు నాయంకులుం దగునెలవుల నిలువం దాను నభి
     నవం బగు రాజమందిరంబున [2]వసియించె నవ్విధంబున నమ్మహాదుర్గంబు వడసి
     యాదవులు శాత్రవులవలని భయంటు విడిచి పురుషోత్తముచేత నభిరక్షితు లై
     పురుహూతసంరక్షణంబున నమరావతిం బ్రమోదించు నమరులకుం బాటి
     యగుచుం బ్రకాశిల్లి రనిన జనమేజయుం డి ట్లనియె.111
చ. అతులితమధ్యదేశమున కంతటికిం దిలకం బనంగ నూ
     ర్జితధనధాన్యసంపదలఁ జెన్ను వహించి ప్రసిద్ధసజ్జనా
     న్విత [3]మయి యొప్పునమ్మధుర నెటొకొలా గ్రమ్మన నుజ్జగింపఁగా
     మతి యటుపుట్టె శౌరి కరిమర్దన మేటిది యాత్మశక్తికిన్.112
వ. అదియునుం గాక కాలయవనుం డెవ్వని పుత్రుం డెంతటిలావు గలవా డతఁ డచ్యు
     తునిదెస నెవ్విధం బొనర్చె నద్దేవుం డెట చని ద్వారకాపురం బేమితెఱుంగునం
     గావించె మఱి యేమిపను లొనర్చె నంతయు వినవలతు ననిన వైశంపాయనుం
     డతని కి ట్లనియె.113

వైశంపాయనుండు జనమేజయునకుఁ గాలయవనుని జననప్రకారం బెఱిఁగించుట

సీ. వినుము వృష్ణ్యంధకవితతి కాచార్యుండు గుణగరిష్ఠుండు [4]గర్గుండు నాఁగఁ
     గలఁ డాతఁ డాజన్మకలితసమంచితబ్రహ్మచర్యంబునఁ బరఁగుచుండ

  1. యనుపమానవిశేషంబు లాదరమున
  2. నివసించె
  3. యగుచుండు
  4. గర్గుం డనంగ