పుట:హరివంశము.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

హరివంశము


బులవలన సప్తధాతుసందీపితంబు లై పొడము శరీరంబులు ప్రాణముఖసమీ
రణంబులఁ జేష్టించువెరవు సూత్రించి కళాకాష్ఠాదులచేతం బరిగణితం బైనకాల
చక్రంబు యుగమన్వంతరపరార్థరూపంబునం [1]బరివర్తించుచు నుత్పత్తిస్థితిసంహా
రంబులకుఁ దా నొక్కరుండ హేతువై పవిత్రంబులకు నుత్తమపవిత్రంబును
దపంబులకుఁ బరమతపంబును వినయంబులకుఁ బ్రకృష్టవినయంబును దేజస్సులకు
నత్యంతతేజస్సును గతులకు నుదాత్తగతియును ధర్మంబులకు సేతువు నధర్మంబు
లకు నఖాతంబును వేదంబులకు వేద్యంబును బోధంబులకు బోధ్యంబును బ్రాప్తు
లకు బ్రాప్యంబు నగు వస్తు వతండ యన వెలుంగు సర్వజ్ఞుండు నిసర్గజరామరణ
విహ్వలం బగు దేహంబు నుద్వహించుట యత్యద్భుతం బవ్విధంబు నాకుఁ దెలియ
నుపదేశింపు మనినఁ బరీక్షిత్తనయునకుఁ బారాశర్యశిష్యుం డిట్లనియె.

7


క.

నీ వడిగిన యీ యర్థము, భూవర కడుఁ గడిఁది దురవబోధం బైన
న్నావిన్నతెఱంగున నీ, భావ మలర విస్తరింతుఁ బరిపాటిఁ దగన్.

8


తే.

విష్ణుమాహాత్మ్యకథనంబు వినుట కిట్లు
బుద్ధి జనియించె [2]నెంతయుఁ బుణ్యతముఁడ
వీవు హరిలీలఁ గీర్తింప నిప్పు డొదవెఁ
గాన నేను గృతార్థుండఁ గౌరవేంద్ర.

9


మ.

విను సర్వంబును దాన యై జగము లావిర్భావదుర్భావముల్
తనయం [3]దొందఁగ నొండుఁ బొందక యచింత్యం బప్రమేయంబు నాఁ
జనురూపం బనిరూపణీయవిశదేచ్ఛం గ్రాల వెల్గొందు ని
త్యనిరాలంబుఁ డనాద్యుఁ డచ్యుతుఁడు చిత్సత్యాత్ముఁ డత్యున్నతిన్.

10


క.

యజ్ఞకారుఁడు విష్ణుఁడు, యజ్ఞేశుఁడు యజ్ఞసత్క్రి[4]యార్చితుఁడును స
ర్వజ్ఞుఁడు యజ్ఞఫలప్రదుఁ, డాజ్ఞ ప్రభుఁ డఖిలమునకు నను నాగమముల్.

11


చ.

అనఘ సహస్రపాదుఁడు సహస్రభుజుండు సహస్రవక్త్రలో
చనుఁడు సహస్రమస్తకుఁడు సర్వమహీవియదంతరాత్మ[5]శా
సనదురక్షతేజుఁ డజశంకరశక్రసమస్తదేవతా
మునిమనుధాతృముఖ్యబహుమూర్తిమయుండు ముకుందుఁ డొక్కఁడున్.

12


వ.

అట్టిమహామహిమ గల దేవుం డొక్కొక్కకాలంబున [6]జగంబుల కుపద్ర
వంబు పుట్టినచోట్లను బృధివికి భరం బైనపట్లను సాధులకు బాధలు గదిరిన
యెడలను ధర్మంబులకుఁ జలనం బెలసిన నెలవులను విచిత్రంబు లగుజన్మంబులం
బచరించి లోకస్థితి నిర్వహించు నతని యవతారంబులు మున్నైనయవియు

  1. బ్రవర్తించుచు
  2. గావునఁ
  3. దుందగనెందు
  4. యాభ్యర్చ్యుడు
  5. భాసనుఁ డనపేక్ష
  6. లోక