పుట:హరివంశము.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వభాగము - ఆ. 3.

81


వ.

ఈరౌహిణేయుండు రత్నవిషయం బైనయవిశ్వాసంబువలన మాదెసం బ్రస
న్నుండు గాకుండు నట్టిదుశ్శంక నంగీకరింపం జేయం జిత్తంబునకు సమాధానం
బెప్పుడు లేక యున్నారము మాకుం బ్రియంబుగా నమ్మణిశ్రేష్ఠం బివ్వరిష్ఠవిచా
రుండు చూడం జూపవలయు ననుటయు నక్రూరుం డా నారాయణునకు సవిన
యంబుగా నిట్లనియె.

238


క.

శతధన్వుఁడు నా చేతికి, నతులితమణి డాఁప నిచ్చి యరుగుట గల దే
నతిదుర్భర మవ్వస్తువు, సతతక్లేశమున మోచి జరపితి దినముల్.

239


తే.

[1]ఊర కిచ్చిన నేమగు నొక్కొయొడయుఁ, డడుగుటయు భక్తి నిచ్చెద నపుడ యేను
నేఁ డడుగు నెల్లి యడుగు నన్నీరజాక్షుఁ, డనుచు గోరుదు భవదీప్సితార్థ[2]కృతికి.

240


క.

ఇదె కైకొను మమ్మణి నీ, మది వలసినవారి కిమ్ము మ మ్మధిక[3]సుఖా
స్పదహృదయులఁ [4]జేయుము దగ, సదభిమతచరిత్ర యనుచు సంప్రీతి మెయిన్.

241


వ.

తనకట్టిన చీరకొంగున నున్నముడి [5]యూడ్చి కాంచనసంపుటంబు దెఱచి సభామ
ధ్యంబు మధ్యందినార్కతేజోవిరాజితం బగునట్లు గావించు విరాజితప్రభావిసరం
బున నసమానం బగునమ్మాననీయరత్నంబు నయ్యదురత్నంబుముందట నివేదిం
చిన నత్యంతలోచనీయం బగుతదీయవైభవంబున.

242


సీ.

బలదేవుఁ డిది నాకుఁ బద్మనాభునకును బొత్తులసొ మ్మని బుద్ధి సేసె
సత్యభామ మదీయజనకునిపడసినయర్థంబు తనుఁ జేరు నని [6]తలంచె
నగ్రజుఁ బ్రియురాలి నాత్మఁజూడక కృష్ణుఁ డొక్కింతవడిగోర్కి మదిల [7]గొనియె
సకలయాదవులును సంస్పృహాలోకనస్మేర[8]విస్మయరసస్తిమితు లైరి


తే.

వృష్ణివరుఁ డంత నాభోజు[9]వీరవరున, కనియె ననఘ యారత్నంబు నాత్మశుద్ధి
కెల్ల చుట్టాలకును నిని యింత సూప, వలసె నింతియ నాదైనవాంఛితంబు.

243


వ.

దీనికిం దాలధ్వజుండును నేనును సత్యభామయు నర్హుల మన్యులకుం బనిగాదు
సకలకాలగుశులును సంభృతబ్రహ్మచర్యులును నగు సుజనుల చేత ధార్యమాణం
బై యిమ్మానికంబు నిజంబు నిజప్రభావంబుఁ జూపుం గావున నే మెవ్వరము
నింత [10]నియమంబున కోర్వము సర్వగుణసంశుద్ధభావుండవు నీవ తదీయధారణ
యోగ్యుండవు నీక యిచ్చితి ననిన నట్ల కాక యని సంతసిల్లి.

244


క.

ఆరత్నము గైకొని య, క్రూరుం డది మొదలు గాఁగ గొంకక సాలం
కారముగ బయలుమెఱసి యు, దారతఁ దేజంబు మిగిలెఁ దపసుఁడ పోలెన్.

245


తే.

జలజనాభుమిథ్యాభిశంసనవిముక్తి
యైనయిక్కథ చదివిన ననుదినంబు

  1. ఊరకిచ్చుట గా దది యునికి యెఱిఁగి.
  2. కృతియ
  3. శుభా
  4. జేయందగు
  5. విడిచి
  6. దలఁచి
  7. కొనఁగ
  8. విస్మిత
  9. విభున కిట్టు లనియె.
  10. నియతి