పుట:హరివంశము.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

హరివంశము


వినినఁ దలఁచిన సడిలేక జనులు సర్వ
దోషరహితులై పొందుచుందురు శుభంబు.

246


క.

అని వైశంపాయనుఁ డ, త్యనుపమయశుఁ డగు పరీక్షిదాత్మజునకుఁ జె
ప్పినపుణ్యకథన మఖిలము, [1]ననతారివిదారి దారుణాసివిభాసీ.

247


శా.

కాంతాఖేలనపుష్పబాణ కరుణాకల్యాణ విజ్ఞానవ
చ్చింతాస్వీకృతశౌరి సత్కృపమఖశ్రీప్రీతగీర్వాణ దు
ర్దాంతోదగ్రశరాసనప్రథితవిద్యాద్రోణ వాణీధురీ
ణాంతర్వాణిజనార్చితోజ్జ్వలగుణా యానమ్రవిద్వద్గణా.

248


క.

రామాయణహరివంశ, శ్రీమన్మధుర[2]ప్రసంగ సిద్ధ చిరయశ
స్సామర్థ్యకరణ[3]నిపుణా, శ్రీమల్లచమూవరేణ్యసేవితహృదయా.

249


మాలిని.

సుజనభజనదుష్టస్తోమనిర్మర్దకామా
త్యజనచతురవృత్తిస్థాపనోద్దీపితా[4]ర్థా
యజనముఖసుకర్మ[5]ప్రాపితాభంగకీర్తి
ధ్వజ కలియుగకృష్ణా దానకేళి సతృష్ణా.

250


గద్యము.

ఇది శ్రీ శంకరస్వామిసంయమీశ్వరచరణసరోరుహధ్యానానంద సౌందర్య
ధుర్య శ్రీసూర్యసుకవిసంభవ శంభుదాసలక్షణాభిధేయ యెఱ్ఱయనామధేయ
ప్రణీతం బైన శ్రీహరివంశంబునం బూర్వభాగంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. ననయము నానందవిస్మితాస్యుం డగుచున్.
  2. ప్రబంధసేవ
  3. కరుణనిత్య
  4. ర్థిప్రజననముఖకర్మ
  5. ప్రాభవ - ఈ పాఠమున యతిభంగము. (చూ. పాఠాంతరములు).