పుట:హరవిలాసము.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము 81

ముందఱగాఁ జని మునిశాపయుక్తి మూఁడులోకంబులరాచసిరి యబ్ధిలో మునింగినభంగి తేటతెల్లంబుగఁ దెలియంబఱచిన నానలినాసనుండు వెన్నునిం గూర్చుకొని మాసమీపమునకు వచ్చి మ మ్మిట్లు సన్నుతించె. 32

క. జయ పార్వతీమనోహర! జయ పరమానంద! జయ నిశాకరమౌళీ!
జయ భూమిసలిలపావక, వియదనలార్కేందుహోతృవిలసితమూర్తీ! 33

క. త్రిభువనభువనారంభా, రభటీసురంభమూలరత్నస్తంభా!
యభినవహిమకరరేఖా, శుభికాలంకారధామశోభితమకుటా! 34

క. దివసావసానసంధ్యా, నవపరమానందనందినాందీనాథ
వ్యవహారఝంక్రియావధి, వివిధమహాతాండవైకవిద్యాభిరతా! 35

క. తరుణహిమకిరణరేఖా, భరణా! సురనికరమకుటభాసురరత్న
స్ఫురణాపరిచయరంజిత,చరణా! నిరుపాధికాభిసంప్రతికరుణా. 36

తే. ఆజర! యవ్యయ! యనపాయ! యప్రమేయ!, యాద్య! యనవద్య! వేదవిద్యాభివంద్య!
నిర్మలాకార! నిర్ద్వంద్వ! నిరుపమాన!, నిత్య! నిజభక్తవైకుంఠ! నీలకంఠ. 37

వ. అని యనేక ప్రకారంబులం బస్తుతింప ననుకంపాపరాధీనుఁడ నగునే ని ట్లంటి. 38

తే. అబ్ధి మథియింపవలయు నీయవసరమున, నమృశలక్ష్మీప్రధానమహాపదార్థ
సముదయంబులు లేకున్న జగము లెల్ల, విన్నఁబోయిన వతిదీనవృత్తి నొంది. 39

సీ. ఆరసాతలమగ్న మయ్యు మునుంగని మందరాద్రీంద్రంబు మంథయష్టి
సర్వసర్వంసహాసంభృతిప్రవణుండు దందశూకస్వామి తరువుఁద్రాడు
చరమాంగపీఠికాస్థాపితశేషుండు కితవకచ్ఛపరాజు క్రిందిమట్టు
నింద్రాదిసురలు బలీంద్రాదిదనుజులు దర్పదుర్వారులై త్రచ్చువార
తే. లేను బ్రహ్మయు హరియును నింత నంత, నుండువారము కార్యప్రయోగరక్ష
నీవిధంబున దుగ్ధాబ్ధి యేచి తరువ, వివిధసద్వస్తులుం బ్రభవింపఁగలవు. 40

వ. ఇట్టి మహా ప్రారంభంబునకుం దగినసాధనసామగ్రి యిది. శేషుండును గమఠపతియును నశేషభువనభారంబునకుం దగినవారి నియోగించి వచ్చునది. యచ్యుతుండు సురాసురులం గూర్చుకొని మందరాచలంబు పెఱికితెచ్చునది. యేనును బితామహుండును మున్నాడి పాలమున్నీటిదరికిం జేరి యుండువారము. ఇదియ నిశ్చయం బని యే నంతర్ధానంబుఁ జేసితి. జలజాసనుండును మదాదేశంబున దుగ్ధాబ్ధితీరంబుఁ జేరె. జనార్దనుండును దేవదానవసేనాసమేతుండై దిక్పాలురుఁ గూడ రాఁ బశ్చిమదిశాముఖుండై చనువాఁడు ముందర. 41

శా. కాంచె న్మందరశైలమున్ మృదుతటీగండోపలశ్రేణికా
చంచన్నిర్జరవేణికాఘుమఘుమస్ఫాయద్దిశాగోళమున్